Friday, April 26, 2024
Home వార్తలు అక్వా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

అక్వా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ఆక్వా విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో రూ.3,300 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కు. రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు, ఎల్లో మీడియాను మరో సారి విమర్శించారు. చంద్రబాబులో ఇవే చివరి ఎన్నికలు అన్న భయం కనిపిస్తుందని అన్నారు. తాను గెలిస్తే ఏం చేస్తానో చెప్పకుండా తనను గెలిపించకపోతే చివరి ఎన్నికలని బ్లాక్ మెయిల్ మాత్రం చేస్తున్నారని జగన్ అన్నారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీ సేనగా మార్చేశారని విమర్శించారు.

గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని, రాబోయే ఎన్నికల్లో గుడ్ బై చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని జగన్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లోనూ వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. చివరకు కుప్పంలోనూ వైసీపీనే గెలిపించారని జగన్ గుర్తు చేశారు. 45 ఏళ్లలో ఎప్పుడు చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తున్నామని జగన్ వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించిందని తెలిపారు. కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే తమకు మద్దతు ఇవ్వమని జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలని అన్నారు. మంచి జరిగితే వైసీపీకి అండగా, తోడుగా నిలబడాలని జగన్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...