Thursday, May 2, 2024
Home విశ్లేషణ నాడు ఎన్టీఆర్ భవన్ కు టూలెట్ బోర్డ్ అన్నారు….నేడు ఏపిలో సీన్ రివర్స్..

నాడు ఎన్టీఆర్ భవన్ కు టూలెట్ బోర్డ్ అన్నారు….నేడు ఏపిలో సీన్ రివర్స్..

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు కు తెలంగాణలో పని ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడ పెత్తనం చేస్తాడా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణ,గోదావరి నదుల మీద జల వివాదాలు తలెత్తినప్పుడు చంద్రబాబు ఆంధ్ర పక్కనే నిలబడతాడు కదా? అలాంటి చంద్రబాబు తెలంగాణ కు అవసరమా? ఆ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందా? మహారాష్ట్ర ఎన్నికల్లో మేము పోటీ చేస్తే అక్కడి ప్రజలు మమల్ని ఆదరిస్తారా? పోయి ని రాష్ట్రంలో నీ పని చేసుకో అంటారు. మరి తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు ఎందుకు స్వాగతం పలకాలే..ఇది గతంలో తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ను విమర్శిస్తూ బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెటిఆర్ ఒక అడుగు ముందుకు వేసి అతి త్వరలో తెలంగాణలో టిడిపి భవన్ కు టూలెట్ బోర్డ్ పెట్టబోతున్నాం అని వ్యాఖ్యానించారు.అధికారం లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను అనగదోక్కడం,విమర్శించడం అంత సులభంనే..కానీ అధికారం కోల్పోయినప్పుడు ఆ సమస్య వారికే వర్తిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బిఆర్ఎస్ పరిస్థితి. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభించిన ఎనిమిది నెలలు గడువకుందే ఏపి బిఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అధికార వైసిపి లో చేరారు.

  • జాతీయవాదంకు బిఆర్ఎస్ ముగింపు పలుకుతుందా ?

రాష్ట్రాల వారీగా మాత్రమే విడి పోయాం.తెలుగు ప్రజలుగా కలిసుందాం. ఏపికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో గళం ఎత్తుతాం…విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకుంటాం.తెలంగాణలో ఇచ్చిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో రైతు బంధు..ఇతర సంక్షేమ పథకాలు ను అమలు చేస్తాం..ఇది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తమ శాఖ ను ఏర్పాటు చేస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యాలు చేశారు.నేడు ఆ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయింది. సీట్ల పరంగా అధికార కాంగ్రెస్ పార్టీతో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ..ఓట్ల నమోదు విషయంలో కాంగ్రెస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి వ్యత్యాసం 2 శాతం లోపే మాత్రమే ఉన్నది. దేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ దృష్టి మొత్తం తెలంగాణలో కేంద్రీకరించింది. వారం రోజుల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా ను మెడలో వేసుకున్నారు.

- Advertisement -

ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము కాంగ్రెస్ లో చేరటం లేదని వెల్లడించారు.ప్రస్తుతం తెలంగాణలో సొంత పార్టీ ఎమ్మెల్యే లను కాపాడుకొలేని పరిస్థితి బిఆర్ఎస్ కు స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ధక్షణం నుంచే జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతామని గతంలో తెలిపారు. నేడు ఆ పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆరెఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చటమే కేసీఆర్ చేసిన పెద్ద తప్పిధమని సొంత పార్టీ కార్యకర్తలే రుసరుసలాడుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్ఎస్ దృష్టి తెలంగాణ లోనే కేంద్రీకరిస్తుందా…పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందా అనేది తెలియాలి అంటే మరో ఒక నెల వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...