Sunday, April 28, 2024
Home మా ఎడిటోరియల్ TDP MLAS: టీడీపీ ఎమ్మెల్యేల లేఖ - వైసీపీలో తిప్పికొట్టలేక..! జిల్లాలో రాజకీయ కాక..!!

TDP MLAS: టీడీపీ ఎమ్మెల్యేల లేఖ – వైసీపీలో తిప్పికొట్టలేక..! జిల్లాలో రాజకీయ కాక..!!

- Advertisement -

TDP MLAS: నీరసించింది అనుకున్న టీడీపీకి జోష్ తెచ్చేలా.. జిల్లాలో రైతులను పోరాటానికి సిద్ధం చేసేలా.. తటస్థులను ఆలోచనలో పడేసేలా.. వైసీపీని ఇరుకున పెట్టేలా.. మంత్రులు సైతం సరైన సమాధానం చెప్పలేక దాటవేతతో మాట్లాడేలా… టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన ఒక్క లేఖ ఇంత పని చేసింది..! సరైన సమయానికి.., సరైన సబ్జెక్టుతో, సరైన వ్యక్తికీ బహిరంగ లేఖ రాయడం ద్వారా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు తాము జిల్లా కోసమే అనేలా రాసుకొచ్చారు. దీంతో రాష్ట్రస్థాయిలో వైరల్ అయ్యారు. ఇప్పుడు జిల్లాలో వైసిపిలో ఈ అంశంపై సరైన సబ్జెక్టు తో తిప్పికొట్టే అవకాశమే లేకుండా పోయింది. అందుకే నిన్నటి నుండి వైసీపీలో ఎవరు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సమాధానమివ్వాలి..? రైతులకు ఎలా నచ్చచెప్పాలి.. టీడీపీని ఎలా ఇరుకున పెట్టాలి..? అనేలా చర్చించుకుంటున్నట్టు సమాచారం..!

TDP MLAS: టీడీపీ ఎమ్మెల్యేల రిస్క్.. ఫలితాన్నిచ్చినట్టే..!?

నిజానికి టీడీపీ ఎమ్మెల్యేలువై ముగ్గురు ఒక రిస్క్ చేసినట్టే. రెండు రాష్ట్రాల మధ్య రగులుతున్న రాయలసీమ ప్రాజెక్టు పట్ల అభ్యంతరం చెప్తూ… జిల్లాకు కలిగే నష్టాన్ని వివరిస్తూ.., జిల్లాలో కరువు కాటకాలను సీఎం కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ రాసిన లేఖతో రిస్క్ చేసినట్టే భావించాలి. తెలంగాణతో చేతులు కలిపారని, టీఆరెస్ వాదన వినిపిస్తున్నారని” విమర్శలు వస్తాయని తెలిసినప్పటికీ… జిల్లా కోసం, జిల్లాకు రానున్న తీవ్ర సమస్యని ఎత్తి చూపడం తమ బాధ్యతగా భావించి లేఖ రాశారు. ఆ రిస్క్ వారికి సత్ఫాలితాన్నిచ్చింది. జిల్లాలో రైతులను పూర్తిగా ఆలోచనలో పడేసింది. రాయలసీమ లిఫ్ట్ వలన జిల్లాకు కలిగే నష్టం రైతులకు తెలిసింది. అందుకే ఇటు రైతుల్లోనూ.. అటు ప్రజా సంఘాల్లోనూ.. దీనిపై పోరాటానికి ఆలోచనలు మొదలయ్యాయి. టీడీపీ కూడా ఈ పోరాటాన్ని ముందుండి నడిపించడానికి సిద్ధమవుతోంది. “మేము రాయలసీమకు వ్యతిరేకం కాదు. మా జిల్లాకు న్యాయం చేసి, మా నీళ్లు ఇచ్చి.., రాయలసీమకు ఎన్ని నీళ్లయినా ఇచ్చుకోండి” అంటూ ప్రాంతీయ, స్థానిక సెంటిమెంట్ తో ఎమ్మెల్యేలు ముగ్గురు బలమైన ముద్ర వేశారు.

TDP MLAS: Letter Not Answer From YSRCP shock to Party

వైసీపీలో సమాధానం లేనట్టే..!?

- Advertisement -

ఈ లేఖపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. మీడియాతో మాట్లాడారు. కానీ జిల్లా సమస్యలపై ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలపై సూటిగా సమాధానం చెప్పలేక.., మొత్తం రాజకీయ పులిహోర చేసేసారు. చంద్రబాబునీ, టీడీపీని, ఆ ఎమ్మెల్యేలను తప్పు పట్టారు తప్ప…. రాయలసీమ లిఫ్ట్ వలన ప్రకాశం జిల్లాకు ఎటువంటి నష్టం లేదు అనే భరోసా మాత్రం ఇవ్వలేకపోయారు. ఇటు జిల్లాలోని వైసీపీ నేతలు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. నిజానికి వేరే అంశం ఏదైనా అయితే మంత్రి బాలినేని లేదా సీనియర్ నాయకులు ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చేసే వారు. కానీ ఇది నీటితో ముడిపడిన సున్నితమైన అంశం.. పైగా టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రతీ పాయింట్ జిల్లా కోసమే.., జిల్లా రైతుల కోసమే.. ఆ లేఖలో రాజకీయం లేదు. జిల్లాకు కావాల్సిన ప్రయోజనాల కోసం మాత్రమే అడిగారు. సో… ఆ లేఖని రాజకీయంగా రచ్చ చేసి, ప్రతిపక్షాన్ని తప్పు పట్టె అవకాశం కూడా ఇప్పుడు అధికార పార్టీకి లేకుండా పోయింది. నిన్న, ఈరోజు ఆ పార్టీ నాయకులు కొందరు కలిసి చర్చిస్తున్నట్టు తెలిసింది. “సాగర్ నీళ్లు జిల్లాకు వస్తాయి.., రాయలసీమ ప్రాజెక్టు వలన జిల్లాకు ఎటువంటి నష్టం లేదు అని నిరూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చేయలేని పక్షంలో మంత్రి అనిల్ కుమార్ తరహాలో జనరలైజ్ చేసి స్థానికానికి ముడి పెట్టకుండా టీడీపీని, ఎమ్మెల్యేలను తప్పు పట్టే ప్రణాళికల్లో ఉన్నట్టు తెలుస్తుంది.

జిల్లాలో అదే చర్చ..!!

- Advertisement -

ప్రస్తుతం ఈ రెండు రోజుల నుండి జిల్లాలో ఎక్కడ చూసినా ఈ లేఖ అంశమే చర్చకు వస్తుంది. తటస్థులు, రైతులు, ప్రజా సంఘాల్లో కూడా ఈ లేఖ అంశమే మాట్లాడుకుంటున్నారు. జిల్లాకు ఇంత నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదని.., సాగర్ నుండి జిల్లాకు నీరు సాధించే వరకు పోరాడాలని రైతు నాయకులూ పేర్కొంటున్నారు. ఈ ఊపుతో జిల్లాలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. జిల్లాలో నాట్లుకు సిద్ధమవుతున్న సరైన సమయంలో నీటి అంశంపై సీఎంకి లేఖ రాయడం ద్వారం తమ పార్టీ ఎమ్మెల్యేలు మంచి అడుగు వేశారని.. ఇది జిల్లాలో పార్టీ హుషారెక్కడానికి అతి పెద్ద మలుపుగా పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

YSRCP: అనగనగా.. ఓ గ్రామం.. ఆ గ్రామానికి శివారున ఎస్టీలు నివసించే ప్రాంతం.. ఆ ప్రాంతం భూగర్భాన విలువైన గ్రానైట్ నిక్షేపాలు...

Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ “పవన్నినాదం” వ్యూహమేనా..!? దర్శిలో “రెండు పార్టీల్లో” కొన్ని క్లైమాక్స్ ట్విస్టులు..!?

Darsi Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే అందరి చూపు "అద్దంకి, పర్చూరు, చీరాల"పైనే ఉంటుంది.. కానీ దర్శి, కొండపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో కనిపించని సైలెంట్ మార్పులు...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...