Thursday, March 28, 2024
Home మా ఎడిటోరియల్ YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

- Advertisement -
  • YSRCP: అనగనగా.. ఓ గ్రామం.. ఆ గ్రామానికి శివారున ఎస్టీలు నివసించే ప్రాంతం.. ఆ ప్రాంతం భూగర్భాన విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి.. దాదాపు 11 ఎకరాలు పసిడి కంటే ఎన్నో రెట్లు విలువైన నేల.. ఆ విషయం ఎప్పుడో పదేళ్ల కిందటే బయటపడింది.. నాటి నుండి “ఆ ఎస్టీలను అక్కడి నుండి పంపించేసి.. ఆ గ్రానైట్ క్వారీని తవ్వేయ్యాలని” అధికారంలో ఉన్న నాయకులు చేయని ప్రయత్నం లేదు.. ఇప్పుడు ఆ కథ క్లైమాక్స్ కి చేరింది.. కానీ ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది.. ఆ కథేమిటో.., ఆ ట్విస్టు ఏమిటో.. ఎవరెవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారో చూద్దాం..!

YSRCP: నాడు సగం.. నేడు మిగిలిన సగం..!

ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే (ఆయన గతంలో వేరే పార్టీలో ఉన్నారు) అధికారంలో ఉంటూ గ్రానైట్ రంగంలో చక్రం తిప్పుతున్న సమయంలోనే ఈ ప్రాంతంలో గ్రానైట్ గనుల గురించి తెలిసింది.. అందుకు ఆయన దాన్ని స్వాధీనం చేసుకుని, తన వాళ్లకు ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.. వీళ్ళు ఖాళీ చేస్తేనే, ఆ భూమి దక్కుతుంది.. ఆ భూమి దక్కితేనే గ్రానైట్ చిక్కుతుంది.. అందుకే ఆ ఎస్టీలను వేరే ప్రాంతానికి తరలించాలని భావించి, వేరే ప్రాంతాల్లో ఇల్లు మంజూరు చేయించి.. నిర్మించారు.. కానీ కథ అప్పుడే అడ్డం తిరిగింది. విషయం బయటకు పొక్కడం, ఎస్టీల అంశం వివాదాస్పదమవ్వడంతో ఆయన అక్కడితో వదిలేసారు. అంటే గ్రానైట్ తవ్వకాల కోసం భూమిని దక్కించుకునే ప్రక్రియలో 40 – 50 శాతం అప్పుడే పూర్తి చేశారు.. కానీ రాజకీయంగా అనవసరమైన చిక్కులకు వెనకడుగు వేసి వదిలేసారు.. !

  • కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గ నాయకులకు అక్కడ కన్ను పడింది.. ఈ నియోజకవర్గ కీలక నాయకుడితో సహా జిల్లాలో బాగా పేరొందిన నాయకుడి కన్ను కూడా దానిపైనే ఉంది.. నాడు సదరు ఎమ్మెల్యే వదిలేసిన చోటనే ఈ నేతలు పని మొదలు పెట్టారు.. ఆ ఇళ్లను ఖాళీ చేయించడం.., భూమిని దక్కించుకోవడం.. కొందరి పేరిట రాయించడం.. అందుకు చాలానే ఖర్చు చేయడం అన్నీ జరిగిపోయాయి.. 99% పూర్తి చేసారు. భూమి మొత్తం చేతికి చిక్కింది.. కానీ గ్రానైట్ తవ్వాలి అంటే “గనుల శాఖ అనుమతులు ఉండాలి”.. సో.. ప్రస్తుతం ఆ ఫైల్ అక్కడే ఆగింది.. ఉన్నత స్థాయిలో దస్త్రం ఆగిపోయింది. మూడు నెలల నుండి కదలడం లేదు, అధికారులు ఫైనల్ సంతకం చేయడం లేదు..!

తాజాగా ఏం జరిగిందంటే..!?

తాజాగా సదరు నియోజకవర్గ నాయకుడు.. కొందరు అనుచరులతో కలిసి రాజధానికి వెళ్లారు.. గనుల శాఖ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ ఒక కీలక అధికారిని కలిసి “మా ఫైల్ ఎందుకు ఆపుతున్నారు..? ఎవరు ఆపమని చెప్తున్నారు..?” అంటూ నిలదీసారు. దాదాపు అరగంట పాటూ అక్కడే చిందులేశారు. ప్రభుత్వంలో పలువురి పెద్దలకు ఫోన్ చేసి.. జిల్లాలోని ముఖ్యనేత ద్వారా ఆ అధికారికి మాట్లాడించారు.. కానీ పని జరగలేదు. సీఎం కార్యాలయం నుండి సిగ్నల్ వస్తేనే సంతకం చేసి ఇవ్వగలమని తేల్చి చెప్పేసారు.. ఇక చేసేదేం లేక సదరు నాయకుడు కాసేపు అక్కడే ఉండి.. చాలా ప్రయత్నాలు చేసి.. విఫలయత్నాలతో తిరిగొచ్చేశారు. ఈ గొడవ ఇప్పుడు తాడేపల్లి వైసీపీ సర్కిళ్లలో బాగా పాకింది. పార్టీ పెద్దల దృష్టిలో కూడా ఉంది.. సున్నితమైన వ్యవాహారం, అవినీతి తంతు కూడా కొంత ఉండడంతో దీన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. కాకపోతే జిల్లా, నియోజకవర్గ నేతలే ఈ పని జరిగితే చాలు.. అనేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ ప్రాంతంలో గ్రానైట్ అత్యంత విలువైందట.. తవ్వకాలు జరిపితే భారీగానే లాభాలు వస్తాయట.. అందుకే అంత పట్టు పడుతున్నట్టు సమాచారం..!

- Advertisement -
RELATED ARTICLES

Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ “పవన్నినాదం” వ్యూహమేనా..!? దర్శిలో “రెండు పార్టీల్లో” కొన్ని క్లైమాక్స్ ట్విస్టులు..!?

Darsi Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే అందరి చూపు "అద్దంకి, పర్చూరు, చీరాల"పైనే ఉంటుంది.. కానీ దర్శి, కొండపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో కనిపించని సైలెంట్ మార్పులు...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Balineni: బాలినేని భారీ ప్లాన్ ..! 18, 22 తేదీల్లో కొన్ని సెన్సేషన్స్ తప్పవా..!?

Balineni: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు కూడా. ఓ రకంగా వైఎస్ఆర్ కుటుంబ...

Most Popular

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...