Thursday, May 2, 2024
Home మా ఎడిటోరియల్ Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ "పవన్నినాదం" వ్యూహమేనా..!? దర్శిలో "రెండు పార్టీల్లో" కొన్ని క్లైమాక్స్...

Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ “పవన్నినాదం” వ్యూహమేనా..!? దర్శిలో “రెండు పార్టీల్లో” కొన్ని క్లైమాక్స్ ట్విస్టులు..!?

- Advertisement -

Darsi Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే అందరి చూపు “అద్దంకి, పర్చూరు, చీరాల”పైనే ఉంటుంది.. కానీ దర్శి, కొండపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో కనిపించని సైలెంట్ మార్పులు చకచకా జరిగిపోతున్నాయి.. భిన్నమైన సామజిక వర్గాల కలయికగా ఉన్న దర్శి రాజకీయాల్లో సైలెంట్ పోరు.. రెండు పార్టీలకు సంకేతాలిస్తుంది.. నిన్నటికి నిన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి పేస్ కళాశాలలో కుర్రాళ్ళు “పవన్”నినాదం చేశారు.. దీని వెనుక ఎమ్మెల్యే వర్గం ప్లాన్ ఉందనే అనుమానాలున్నాయి.. అది బయటకు పొక్కి.. సీరియస్ అంశంగా మారడంతో చేసేదేం లేక ఆ కుర్రాళ్లపై కేసులు పెట్టె వరకు వెళ్ళింది..! కానీ.. ఎన్నికలు సమీపించే సమయానికి కొన్ని ఆకస్మిక ట్విస్టులు తప్పేలా లేవు..! వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే స్పష్టత లేదు.. టీడీపీ అభ్యర్థిగా ఎవరు రానున్నారనే అనుమానాలు వీడడం లేదు.. కానీ.. ఓ అంతర్గత లెక్క, ప్రయత్నాలు, చర్చల ప్రకారం..

Darsi Politics: పేస్ కాలేజీలో ఏం జరిగింది..!?

పేస్ కాలేజీ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వాళ్లదే.. ఆ కళాశాలలో మొన్న వార్షికోత్సవ వేడుక నిర్వహించారు.. ఈ వేడుకలో చివరి వరుసలో ఉన్న కుర్రాళ్ళు కొందరు “జై పవన్.. జై జనసేన” నినాదాలు చేస్తూ.. జగన్ వద్దు, పవన్ ముద్దు” అంటూ అరిచారు.. ఆ పై సోషల్ మీడియాలో కూడా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేనకు మద్దతు పలకాలంటూ కొందరు పోస్టులు పెట్టారు.. ఇది వైరల్ కావడంతో ఆ కుర్రాళ్లపై దర్శి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసారు..! వాస్తవంగా జరిగిన వివాదం ఇదే.., కానీ ఆ కుర్రాళ్ళ వెనుక ఎమ్మెల్యే వర్గం ఉందని.. “వివిధ వర్గాల స్పందన కోసం.. ఉద్దేశ పూర్వకంగానే” వాళ్ళ చేత అలా చేయించారని కొన్ని వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి.. అది “వ్యూహమో.. యాదృచ్చికమో” పక్కన పెడితే.. ఇప్పుడు దర్శి ఎమ్మెల్యే వ్యవహారశైలిపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి..

  • దర్శిలో “గడప గడపకు మన ప్రభుత్వం” సక్రమంగా జరగడం లేదు. జెండాలు, కరపత్రాలు, ఇతర మెటీరియల్ రాలేదనే నెపంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. మొదటి రెండు రోజులు మాత్రమే తాల్లూరు మండలం.., కురిచేడు మండలంలోనే ఒక్కో గ్రామంలో చేసారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడంపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి..!

దర్శి రాజకీయం మారింది అప్పుడే..!

- Advertisement -

దర్శి నియోజకవర్గ రాజకీయం మొత్తానికి ఆరు నెలల కిందటే పెద్ద మార్పునకు బీజం పడింది.. గతేడాని నవంబరులో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఏది చెప్తే అదే జరిగేది.. పార్టీ కూడా అతనికి ప్రాధాన్యత ఇచ్చెది.. ఎమ్మెల్యే ఒంటి చేత్తో శాసించారు.. ఒకానొక సందర్భంలో (బూచేపల్లి వెంకాయమ్మ జెడ్పి చైర్మన్ అయ్యాక సీఎం జగన్ ని కలిసినప్పుడు) బూచేపల్లి శివప్రసాద్న్ రెడ్డికి సీఎం జగన్ కూడా చెప్పేసారు.. “2024 లో కూడా దర్శి సీటు మద్దిసెట్టికే ఇస్తాం.., మీకు 2023లో ఎమ్మెల్సీ ఇస్తాను” అని చెప్పేసారు.. అప్పటి వరకు ఎమ్మెల్యేపై అంత నమ్మకం ఉండేది..!

  • కానీ దర్శి మున్సిపాలిటీ ఓటమి వైసీపీలో “గాలి బుడగల” బలాన్ని.. “వెన్నుపోటు” వర్గాన్ని క్లియర్ గా చూపించింది. ఈ ఓటమితో ఈ నియోజకవర్గంలో వైసీపీ బలం, బలహీనత మొత్తం బయటకు తెలిసిపోయింది. ఎమ్మెల్యే హవా తగ్గింది. మాట పోయింది. అందుకే పార్టీ కూడా అప్రమత్తమైంది.. ఓ వైపు మద్దిశెట్టిలో భయం పెరిగింది.., మరోవైపు బూచేపల్లిలో సీటు తనదేనన్న ధీమా పెరిగింది. మద్దిశెట్టి మాత్రం కొన్ని రిస్కులు చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం. అది ఇప్పుడే బయట పడే అవకాశం లేదు.. కానీ బూచేపల్లి ఎప్పుడూ నేరుగా రాజకీయం, పొలిటికల్ రిస్క్ చేసే టైప్ కాదు.. సేఫ్ గేమ్ ఆడతారు.. వెనుక నుండి వ్యూహాలు వేస్తూ.. తన దగ్గరకే పార్టీ రావాలి, బతిమాలాడాలి” అనుకునే టైప్.. అందుకే కొంత నష్టపోయారు. వచ్చే ఎన్నికల్లో ఇదే వ్యూహంతో ఉన్నారనేది ఓ అంతర్గత సమాచారం..!
Darsi Politics: YSRCP Climax Twists
Darsi Politics: YSRCP Climax Twists
  • సో.. ఎమ్మెల్యే పక్క చూపులు నిజమేనేమో అనే అనుమానాల మధ్య.. బూచేపల్లి ధీమాలో అతి విశ్వాసం మధ్య.. దర్శిలో వైసీపీ సీటు కోసం శిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్ తీవ్రమైన ప్రయత్నాలు మొదలు పెట్టారు.. వీళ్లకు ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ ముగ్గురికీ కాకుండా జిల్లాలో పేరు మోసిన నేత ఇక్కడ నుండి పోటీ చేస్తే తనకు సేఫ్ అనుకుంటున్నారట.. సో.. దర్శి వైసీపీలో ఎన్నికలకు ముందు రోజుల్లో.. లేదా కొద్ది రోజుల్లోనే ఏమైనా జరగొచ్చు..! “దర్శి టీడీపీలో ట్విస్టులు కూడా కొన్ని ఉన్నాయి. కేవలం తెరపైన మాత్రం పమిడి రమేష్ అనే నాయకుడు ఇంచార్జి.. నిజానికి ఈయన ద్వితీయశ్రేణి వరకే పరిమితం.. పార్టీ అభ్యర్థి విషయంలో మాత్రం కొన్ని ప్రణాళికలు ఉన్నాయి.. అవేమిటో వచ్చే కథనంలో చర్చిద్దాం..!
- Advertisement -
RELATED ARTICLES

YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

YSRCP: అనగనగా.. ఓ గ్రామం.. ఆ గ్రామానికి శివారున ఎస్టీలు నివసించే ప్రాంతం.. ఆ ప్రాంతం భూగర్భాన విలువైన గ్రానైట్ నిక్షేపాలు...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Balineni: బాలినేని భారీ ప్లాన్ ..! 18, 22 తేదీల్లో కొన్ని సెన్సేషన్స్ తప్పవా..!?

Balineni: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు కూడా. ఓ రకంగా వైఎస్ఆర్ కుటుంబ...

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...