Sunday, May 5, 2024
Home మా ఎడిటోరియల్ Gottipati granite cases: గుండె తరుక్కుపోయే "గొట్టిపాటి గ్రానైట్ కేసుల కథ"..! ఇంత లోతుగా ఎవ్వరికీ...

Gottipati granite cases: గుండె తరుక్కుపోయే “గొట్టిపాటి గ్రానైట్ కేసుల కథ”..! ఇంత లోతుగా ఎవ్వరికీ తెలియదు..!!

- Advertisement -

Gottipati granite cases: “ఇది గుండె తరుక్కుపోయే కథ.. ఇది కళ్ళు చెమర్చే రాజకీయ కథ.. ఇది కాళ్ళు వణికే కక్షల కథ.. ఇది ప్రకాశం జిల్లాలో గడిచిన రెండేళ్లలో జరిగిన “గొట్టిపాటి గ్రానైట్ కేసుల కథ”..! పార్టీల అభిమానాలను కాసేపు పక్కన పెట్టి.. రాజకీయ భజనలను కాసేపు మడిచి పెట్టి.. మానవత్వంతో, మనిషి తత్వంతో లోతుగా అర్ధం చేసుకుని చదవాల్సిన కథ ఇది..!!

- Advertisement -

ఒక మనిషిపై ప్రభుత్వం/ వ్యవస్థ పగపట్టింది.. ఆర్ధికంగా దెబ్బకొట్టాలి అనుకుంది.. ఆస్తులన్నీ వేలం వేసేయాలి అనుకుంది.. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపించాలి అనుకుంది.. అతని కుటుంబం సహా నడి రోడ్డున నిలబెట్టాలి అనుకుంది.. అందుకు అన్ని చట్టాలను ప్రయోగించింది.. అన్ని అస్త్రాలను బయటకు తీసింది.. 55 కేసులు పెట్టింది..!” న్యాయవ్యవస్థలు అనేవి లేకపోతే.., ఆ వ్యవస్థ లక్ష్యం నెరవేరేది…! కానీ.. “ఓ వైపు గుండె దడ.. కేసుల్లో ఓడితే నడిరోడ్డున పడతానేమోననే భయం.., క్రిమినల్ కేసులతో భవిష్యత్తు ఎలా అనే ఆందోళన” దేవుడిపై భారం వేసి, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి రెండేళ్లు చేసిన పోరాటానికి సుప్రీమ్ కోర్టులో నిన్న ఊరట దక్కింది..! ఇక్కడితో ఈ కక్షల కథ ఆగుతుందో.., ఇంకా సాగుతుందో ఆ వ్యవస్థ పెద్దలకే ఎరుక..

Gottipati granite cases: అందరి బాటలో వెళ్ళలేదు.. ఒంటరి పోరాటం చేశారు..!!

- Advertisement -

రెండేళ్ల కిందట జిల్లాలో గ్రానైట్ క్వారీలపై విజిలెన్సు తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే.. ఆ తనిఖీల్లో భాగంగా శిద్ధా రాఘవరావు క్వారీలకు రూ. 260 కోట్లు.. ఆ శిద్దా వెంకటేశ్వరరావు, హనుమంతరావు, సూర్యప్రకాశరావు క్వారీలకు కలిపి రూ. 650 కోట్లు.. గొట్టిపాటి రవికుమార్ క్వారీలకు రూ. 285 కోట్లు ఇలా ఫైన్లు వేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద దాదాపు 19 మందికి రూ. 2100 కోట్లు వరకు ఫైన్లు వేశారు. ఈ ఫైన్ల అనంతరం నెలకోసారి “కడతారా, క్వారీలు మూస్తారా..?” అంటూ అధికారులు షోకాజు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఇక చేసేదేమి లేక శిద్ధా వారి కుటుంబం సహా పెద్దలు కొందరు వైసీపీలో చేరిపోయారు. కొందరు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు అంతర్గతంగా లొంగిపోయారు.. అలా చేరి, లొంగిన వారి క్వారీల ఫైన్ల దస్త్రాలు హోల్డ్ లోకి వెళ్లిపోయాయి. కానీ.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాత్రం లొంగలేదు. ఆయన అప్పటికే గతంలో(2015లో) పార్టీ మారి వచ్చారు.. మళ్ళీ ఈ కేసులు, ఫైన్లుకి భయపడి పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్తే తానూ వ్యాపారం చేసుకోవచ్చు. ఫైన్లు నుండి బయటపడవచ్చు.. కానీ ఆయన నిర్మించుకున్న “పొలిటికల్ క్రెడిబిలిటీ” పోతుంది. టీడీపీలో నిర్మించుకున్న పునాదులు పోతాయి. నమ్మకం ఆవిరవుతుంది. వ్యాపారం తప్ప విలువలు లేవు అనే దారుణమైన అపఖ్యాతి వస్తుంది.. అందుకే “ప్రతిపక్షంలో ఉంటూనే పోరాడాలి, ఎంతవరకైనా వెళ్ళాలి” అనుకున్నారు. కానీ ఇంత దారుణంగా.. ఉంటుందని ఊహించలేదు.. ఒకానొక సందర్భంలో చాలా ఒత్తిడికి లోనయ్యారు.. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డారు.. బయటకు చెప్పుకోలేక లోలోపల వేదన అనుభవించారు.. ఎందుకంటే… ఒక్క మనిషిపై 55 కేసులు వేశారు..!

800

Gottipati granite cases: ఒకదాని వెంట ఒకటి.. 55 కేసులతో ఉక్కిరిబిక్కిరి..!!

- Advertisement -

గొట్టిపాటి రవికుమార్ కి మొత్తం 11 కంపెనీలు ఉన్నాయి. కిషోర్ గ్రానైట్స్ తరహాలోనే వివిధ పేర్లుతో లీజులు ఉన్నాయి. వాటికి రూ. 285 కోట్ల ఫైన్లు వేశారు. మొదట “ఈ ఫైన్ కట్టాలి.. లేకపోతే క్వారీలు మూసెయ్యాలి” అంటూ షోకాజు నోటీసులు ఇచ్చారు.. అలా 11 క్వారీలపై కేసులు కట్టారు. దీనిపై రవికుమార్ కోర్టుకి వెళ్లారు. కోర్టు ఇతనికి అనుకూలంగా స్టే ఇచ్చింది.. * అనంతరం “మీ ఫైన్లు పెండింగ్ ఉన్నాయి. మొత్తం ఆస్తులను వేలం వేసి రికవరీ పెట్టాలని చూసి.. మళ్ళీ నోటీసులు ఇచ్చారు..” 11 క్వారీలకు ఈ తరహాలో కేసులు నమోదయ్యాయి.. దీనిపై కూడా రవికుమార్ కోర్టుకి వెళ్లారు. అనుకూల తీర్పు వచ్చింది. * మూడో అంశం.. రవికుమార్ అక్రమాలకు పాల్పడ్డారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చూసారు. దీనిపై రవికుమార్ ముందస్తుగా కోర్టుకి వెళ్లారు..! * నాలుగో అంశంగా.. గొట్టిపాటి క్వారీల్లో కాలుష్యం ఎక్కువగా ఉంది.. శాశ్వతంగా మూసెయ్యాలి అంటూ మళ్ళీ నోటీసులు ఇచ్చి, కేసులు వేశారు.. అప్పటికే కేసుల్లో ఉంటూ పనులు జరగని క్వారీల్లో కాలుష్యం ఏమిటి..? అంటూ కోర్టుల్లో ఈ నోటీసులు నిలబడలేదు..! * ఇక క్వారీలు లీజులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.. దీనిపై కూడా కోర్టుకి వెళ్లారు. ఇలా ఫైన్లు కట్టాలని, ఆస్తులు వేలం వేస్తామని, కాలుష్యం ఎక్కువగా ఉందని, అవినీతికి పాల్పడ్డారని క్రిమినల్ చర్యలని.., చివరిగా లీజులు రద్దు అని.. ఆ అయిదు అంశాల్లో 11 క్వారీలపై మొత్తం 55 కేసులు కోర్టులకు చేరాయి. వీటితో పాటూ ఫ్యాక్టరీలు, పేర్మిట్లు, ఇతర అంశాల్లో మరో మూడు కేసులు కూడా ఉన్నాయి..

బయటకు చెప్పలేదు.. రాజకీయంపై ప్రభావం చూపలేదు..!!

నిజానికి కేవలం గొట్టిపాటి క్వారీలు రద్దు.. ఆపేసారు.., ఇబ్బంది పడుతున్నారు” అనే ఆయన అనుచరులకు, పార్టీ నేతలకు తెలుసు.. కానీ ఒకదాని తర్వాత ఒకటి.. దారుణంగా.., లోతుగా ఇబ్బంది పెడుతూ నోటీసులు ఇస్తూ.., కేసులు వేస్తూనే ఉన్నారని కనీసం ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆయన నమ్ముకున్న న్యాయవాదులకు, కొందరు వ్యాపార భాగస్వాములకు మాత్రమే తన పూర్తిస్థాయి ఇబ్బందులను చెప్పుకున్నారు. కేసులపై పోరాడుతూనే.. లోలోపల ఆందోళనకు గురవుతున్నారు.. ప్రతీరోజు దీనిపై న్యాయపరమైన అంశాలను చర్చిస్తూనే ఉన్నారు.. మరోవైపు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు.. ఎక్కడా.., ఏదీ మిస్ కాకుండా చూసుకుంటున్నారు.. కొన్ని నెలల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా చురుగ్గా తిరిగి, పార్టీని యాక్టీవ్ చేసి.. తానే మొత్తం చూసుకున్నారు.. వైసీపీ ఏకపక్షం చేయాలనుకున్న 8 వ వార్డులో.. నామినేషన్లు చివరి నిమిషంలో పోలీసుల కళ్లుగప్పి ఆ మిగిలిన నామినేషన్ కూడా విత్ డ్రా చేయించి.. అధికార పార్టీకే చుక్కలు చూపించారు.. అటు ఆర్థికపరమైన ఒత్తిళ్లు, వ్యాపారపరమైన ఒత్తిళ్లు, పదుల సంఖ్యలో కేసులూ – చర్చలు.. మరోవైపు రాజకీయాలు అన్నిటినీ బాలన్స్ చేసుకుంటూ వచ్చారు.. ఎక్కడా తన వ్యక్తిగత ఇబ్బందుల ప్రభావం లేకుండా చూసుకున్నారు.. రాజకీయ, కేసుల ఒత్తిళ్ల అంతర్గత ఆవేదన బయటపడనీయలేదు.. మొదట హైకోర్టు సింగిల్ బెంచిలో రవికుమార్ కి అనుకూల తీర్పు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వదలలేదు.. హైకోర్టు డివిజన్ బెంచిలో పిటిషన్ వేసింది.. ఈ బెంచిలో రవికుమార్ కి వ్యతిరేక తీర్పు వచ్చింది.. దీంతో సుప్రీమ్ లో పిటిషన్ వేశారు. తనకు ఇది చావో, రేవో తేల్చుకోవాల్సిన సమస్య. కేసుల్లో ఓడితే పరపతి, భవిష్యత్తు పోతుంది.. అందుకే ఇద్దరు సరైన న్యాయవాదులను నియమించారు. గట్టిగా లీగల్ పాయింట్లతో పోరాడారు. చివరికి సుప్రీమ్ కోర్టులో ఒక్కో కేసులో అనుకూల తీర్పులు వస్తూ.. వస్తూ ఈ రోజు ఆ షోకాజ్ నోటీసులపై స్టే ఇచ్చారు..!

ఒక్కసారిగా మారిన జీవనశైలి..!!

అప్పటి వరకు రోజూ కోట్లలో లావాదేవీలు.. చుట్టూ జనం.. రోజుకి 500 మందికి పని.. క్వారీలు, ఎగుమతులు, తవ్వకాలు, నిత్యం రవాణాతో ఒక పూర్తిస్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన గొట్టిపాటి జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. కేసులు, కోర్టులు, నోటీసులుగా మారింది.. రెండు దశాబ్దాలుగా నడిపిన క్వారీలన్నీ మూసుకున్నాయి. తననే నమ్ముకుని ఎక్కడి నుండో పనికి వచ్చిన వాళ్ళకు.. పనిలేక వెళ్లిపోయారు.. అలా గడిచిన రెండేళ్లలో జీవనశైలిలో కొంత మార్పు వచ్చింది. క్వారీలను వదిలేసి మరో వ్యాపారంలోకి దిగారు. తన సన్నిహితుల ద్వారా ఇతర రంగాల్లో భాగస్వామిగా చేరారు..

(గొట్టిపాటిపై ఎందుకు ఇంత కక్ష..!? ఎవరు చేశారు..? రాజకీయ కక్ష ఒక మనిషిపై ఇంతగా ఉంటుందా..!? మరి టీడీపీ నుండి రవికుమార్ కి ఎటువంటి అండ లభించింది..!? వైసీపీలో దీనిపై ఎటువంటి చర్చ జరుగుతుంది..!? జిల్లాలో ఇతర నాయకుల క్వారీల పరిస్థితులు ఏమిటి..? అనేది రేపటి కథనంలో చూద్దాం..!)

- Advertisement -
RELATED ARTICLES

YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

YSRCP: అనగనగా.. ఓ గ్రామం.. ఆ గ్రామానికి శివారున ఎస్టీలు నివసించే ప్రాంతం.. ఆ ప్రాంతం భూగర్భాన విలువైన గ్రానైట్ నిక్షేపాలు...

Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ “పవన్నినాదం” వ్యూహమేనా..!? దర్శిలో “రెండు పార్టీల్లో” కొన్ని క్లైమాక్స్ ట్విస్టులు..!?

Darsi Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే అందరి చూపు "అద్దంకి, పర్చూరు, చీరాల"పైనే ఉంటుంది.. కానీ దర్శి, కొండపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో కనిపించని సైలెంట్ మార్పులు...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....