Home వార్తలు నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ దేవుడుకు, ప్రజలతో పాటు మీకు కూడా తెలుసని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి వ్యాఖ్యానించారు.గురువారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అవరణలో మీడియాతో మాట్లాడుతూ …. రానున్న ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు వివేకానంద రెడ్డి పేరును మళ్ళీ తీసుకువచ్చారని పేర్కొన్నారు. వైసిపి అధికారం లోకి వచ్చిన తరువాత ఒక్క సారైనా మీ చిన్నాన్న ను గుర్తు చేసుకున్నారా? నేడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆయన గుర్తుకు వచ్చారా ? అని ప్రశ్నించారు. ఐదేళ్ల నా పోరాటం న్యాయం కోసమని..మీ పోరాటం మాత్రం పదవులు అధికారం కోసమని తెలిపారు. ఎవరు స్వార్థ పరులు ? ఎవరు పదవులు కోసం హత్య లను ఉపయోగించుకుంటున్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అని ఆమె కోరారు.

అన్నయ్య గా మీ బాధ్యత ఏమిటి ?

చిన్నాన్న ను హత్య చేయించినవారిని ఎందుకు రక్షిస్తున్నారు? హత్య కాబడితే అందులో కుట్ర కోణం నిర్ధారించకుండా..చిన్నాన్న కూతురు మీద నిందలు వేయడం న్యాయమా? నీ చెల్లెలు కోర్టులు చుట్టూ తిరుగుతుంటే….అన్నయ్య గా మీ బాధ్యత ఏమిటి ? అంతకరణ శుద్ధితో నేను నిజం చెప్తున్నాను….జగన్మోహన్ రెడ్డి అలా చెప్పగలుగుతరా అని ప్రశ్నించారు.తనకు ఈ పోరాటంలో ఏం వస్తుంది. అందర్నీ పోగొట్టుకోవడం తప్ప అని వాపోయారు.

నిందితులకే ఓటు వేయమని అడుగుతున్నారా ?

ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ అడిగారు. అధికారం లోకి వచ్చిన తరువాత మీరే వద్దు అని అన్నారు..మీ పేరు బయటకి వస్తుంది అని వద్ధన్నారా? ఆ పిటిషన్ ను ఉపసంహరించు కోవడానికి కారణం ఏమిటి? కడప ఎంపి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించి నిందితుడు అని చెప్తుంది. మీ చిన్నాన్న చంపిన వారికి టికెట్ ఇచ్చి ఓటు వేయమని కోరడం తప్పుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. హత్య చేసిన వ్యక్తే…హత్య కుట్రలో … వైయస్ భాస్కర్ రెడ్డి,వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు..వారి వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి,భారతి రెడ్డి ఉన్నారని కూడా చెప్తున్నారు.ఒకటి నమ్ముతున్నారు ..రెండవది నమ్మడం లేదా? నమ్మితే రెండు నమ్మాలి కదా? వీళ్ళని రక్షిస్తుంది మీరు కాదా అని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి రక్తంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు నిండిపోయాయి. రానున్న ఎన్నికల్లో వైసిపికి, వైయస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లకుఓటు వేయద్దు అని ఆమె పిలుపునిచ్చారు.

Exit mobile version