Home వార్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు వేయాలని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం మదనపల్లె లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ…మరో 47 రోజుల్లో రాష్ట్ర దశ దిశా మార్చే ఎన్నికలు రానున్నాయి అని అన్నారు. ప్రజలందరూ బూత్ కి వెళ్ళే ముందు వైసిపి పెంచిన ధరలు గుర్తుకు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఎవరిదో….మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఎదో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి రాక ముందు ఒక్క ఛాన్స్ అన్నారు..ముద్దులు పెట్టారు..తల నిమిరారు.ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు…గుద్దుడే గుద్దుడు గా పరిపాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సాగు నీరు లేని రైతు వ్యధ వినిపిస్తుంది. ఉద్యోగం లేని యువత కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మాతో కలిసి అడుగు వేసి ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని మార్చుధాం.మంచి చేద్దాం అని పిలుపునిచ్చారు.

గడిచే రోజూ జగన్ అధికారానికి కౌంట్ డౌన్…

రాష్ట్రానికి కీలక సమయం..ఐదు సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలు కు చెక్ పెట్టే సమయం వచ్చింది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు.వైసిపి ఐదేళ్ల పాలనలో ఎవరైనా బాగుపడ్డరా? మీ జీవితాలు ఏమైనా మెరుగు పడ్డయా? ముస్లిం సోదరుల జీవితాలు బాగుపడ్డయా అని ప్రశ్నించారు. రానున్న ప్రతి రోజు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ అని ఎద్దేవా చేశారు. గడిచే ప్రతి రోజూ రాబోయే మంచి ప్రభుత్వానికి దగ్గర చేరుస్తుంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కాను అంటున్నారు..వొట్టి వొట్టి బటన్ నొక్కుతున్నారు.బటన్ నొక్కింది ఎంత? నువ్వు బొక్కింది ఎంత? నీ వాటా ఎంత చెప్పాలని సవాల్ విసిరారు. గతంలో 200 రూపాయలు వచ్చే కరెంట్ బిల్ నేడు 800 అయ్యిందా లేదా? పోలింగ్ రోజున బూత్ కు పోయే ముందు అన్నీ ఆలోచించుకోవాలి…1000 రుపాయలు ఇచ్చి …నెలకు ఒక కరెంట చార్జిలో 1000 రూపాయలు లాగేసి జలగ కావాలా అని ప్రశ్నించారు.ఓటు వేసే ముందు పెరిగిన ఆర్టీసి రేట్లు, చెత్త మీద పన్ను, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి అని తెలిపారు.మళ్ళీ మంచి రోజులు కావాలా? రావణాసురుడి పాలన కావాలా? ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version