Friday, May 3, 2024
Home వార్తలు జగన్….మీ ఛాతీలో ఉన్నది గుండెనా ? బండనా? : వైయస్ షర్మిల

జగన్….మీ ఛాతీలో ఉన్నది గుండెనా ? బండనా? : వైయస్ షర్మిల

- Advertisement -

గత రెండు ఎన్నికల్లో వైకాపా విజయం కోసం పని చేసాను. మీ కోసం బై బై బాబు నినాదం తీసుకువచ్చి తెలుగుదేశం మిద పోరాడాను. 3000 కిలో మీటర్ల పాదయాత్ర చేశాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక రూపాయి పని అడగలేదు.ఒక పదవి అడగలేదు. కాంగ్రెస్ పార్టీలోకి చేరగానే నా మీద వ్యక్తిగత దూషణలు చేస్తారా? చివరకి తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనే కాదనే విమర్శల స్థాయికి దిగజారీ విజయమ్మ ను కూడా అవమానిస్తారా? జగన్ …అసలు మీ ఛాతీలో ఉన్నది గుండెనా? బండ నా ? అని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా … శనివారం ఉదయం 11 గంటలకు కడప పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున వైఎస్‌ షర్మిల రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. కడప పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజుకు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… చిన్న గులకరాయితో సిఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే హత్యాయత్నం అంటున్నారు. వివేకానంద రెడ్డిని ఏడు సార్లు తల మిద నరికితే సాక్షి లో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారు? ప్రతిపక్ష నేతగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కు డిమాండ్ చేసిన జగన్…అధికారంలోకి వచ్చాక ఎందుకు వద్దు అన్నారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తే రాష్ట్ర పోలీసులనే కంచెగా వేసి ఎందుకు కాపాడారు? సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి ఎంపి టికెట్ ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.వివేకా ఆత్మకు శాంతి చకూరాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను చట్ట సభలోకి పంపించకండి…హత్య రాజకీయాలను ప్రోత్సహించకండని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు న్యాయం వైపునే నిలబడాలని ఆమె కోరారు.

వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని ఖూనీ చేస్తారా?

- Advertisement -

సాక్షి పేపర్ లోనే పైన రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉంటుంది. కింద మాత్రం ఆయన సొంత తమ్ముడి వ్యక్తిగత విషయాలపై నిందలు మోపుతారా? వివేక వ్యక్తిగత జీవితం తో మీకేం సంబంధం? వైకాపా తరుపున ఎమ్మెల్సీ గా బరిలోకి ధింపినపుడు ఆయన వ్యక్తిగత జీవితం మీకు గుర్తుకు రాలేదా ? అవినాష్ రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం మీకు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. వివేకానంద రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూన్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...