Tuesday, April 30, 2024
Home వార్తలు మండపేట వైసిపి అభ్యర్థికి బిగ్ షాక్ …..శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు

మండపేట వైసిపి అభ్యర్థికి బిగ్ షాక్ …..శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు

- Advertisement -

రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ మంగళవారం తుది తీర్పు వెలువరించింది. శిరోమండనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.దీంతో పాటు రెండు లక్షల జరిమానా విధించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.1996 డిసెంబర్ 29 న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయాపాలెం లో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరకీ శిరో మండనం చేశారు. ఇద్దరికి కనుబొమ్మలు గీయించారు. బాధితుల్లో ఒకరు మరణించగా.. మిగతా నలుగురు న్యాయం కోసం కోర్టుకెళ్లారు. వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.ప్రస్తుతం మండపేట నియోజవర్గ వైసిపి అభ్యర్థిగా తోట త్రిమూర్తులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...