Tuesday, April 30, 2024
Home వార్తలు పౌరసత్వ సవరణ చట్టం పై టిడిపి,జనసేన,వైసిపిల వైఖరి ఏమిటి ? : వి. శ్రీనివాసరావు

పౌరసత్వ సవరణ చట్టం పై టిడిపి,జనసేన,వైసిపిల వైఖరి ఏమిటి ? : వి. శ్రీనివాసరావు

- Advertisement -

రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పక్క దారి పట్టించి ఉద్దేశపూర్వకంగా టిడిపి,వైసిపి,జనసేన,బిజెపి లు రాళ్ళ రాజకీయం మొదలుపెట్టాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు.మంగళవారం విజయవాడ లో బాలోత్సవ భవన్ లో సిపిఎం ఏపి అసెంబ్లీ ప్రణాళికను , 18 వ పార్లమెంట్ ఎన్నికల ప్రణాళికను వి. శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి. సుబ్బారావు, జే. జయరాం లు విడుదల చేశారు. ఈ సందర్బంగా వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ…మత సామరస్యాన్ని కాపాడుతామని,మైనార్టీలకు, దళితులకు అండగా ఉంటామని వైసిపి, టిడిపి, జనసేన లు ఒక పక్క చెబుతూ….మరో వైపు ఆయా వర్గాల కు వ్యతిరేఖంగా బిజెపి చేస్తున్న అక్రమ చట్టాలను వెనకేసుకొస్తున్నాయని మండిపడ్డారు.రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపితో అంటకాగుతున్న
టిడిపి, జనసేన కూటమి, వైసిపి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సిఎఎ పట్ల మీ వైఖరి ఏమిటి?

- Advertisement -

370 ఆర్టికల్‌ రద్దును సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?

  1. బిజెపి రాజ్యాంగ పీఠికను సవరిస్తే బలపరుస్తారా? వ్యతిరేకిస్తారా?
  2. ఉపా చట్టాన్ని రద్దు చేస్తారా? కొనసాగిస్తారా?
  3. ప్రతిపక్షాలపై బిజెపి దాడుల్ని (ఐటి, ఇడి, సిబిఐ) బలపరుస్తారా? వ్యతిరేకిస్తారా?
  4. ఎన్నికల బాండ్ల రద్దును సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?
  5. బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వనంటుంది. పై పార్టీలు బలపరుస్తాయా? పోరాడి సాధిస్తాయా?
  6. కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను బిజెపి ఎత్తివేసింది. పై పార్టీలు దాన్ని పునరుద్దరిస్తాయా? సమర్ధిస్తాయా?
  7. రాజ్యాంగ వ్యవస్థలైన ఎన్నికల కమీషన్‌, న్యాయవ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతారా? బిజెపికి తాళం వేస్తారా? అప్రజాస్వామిక గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తారా? బలపరుస్తారా?
  8. సిపిఎస్‌ను వ్యతిరేకించి, ఓపిఎస్‌ పునరుద్దరణకు మద్దతిస్తారా?
  9. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి పార్లమెంటులో నిలబడతారా?
  10. కార్మిక కోడ్‌లను వ్యతిరేకిస్తారా? బలపరుస్తారా?
  11. రైతులకు గిట్టుబాటు ధరలు, రుణ విమోచన చట్టాలు, పట్టణ ఉపాధి హామి చట్టాల కోసం పార్లమెంటులో పోరాడతారా? లేక బిజెపికి లొంగిపోయి రైతులకు అన్యాయం చేస్తారా?
  12. అటవీ హక్కుల సంరక్షణ చట్ట సవరణ వ్యతిరేకిస్తారా? బలపరుస్తారా? జివో 3 పునరుద్దరణ పట్ల మీ వైఖరి ఏమిటి? ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్‌ 5 ప్రకారం 1/70 అమలు చేస్తారా? లేదా? అని ప్రశ్నించారు.
- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...