Friday, May 3, 2024
Home వార్తలు Tuition Teacher rape: విద్యార్థినిపై ట్యూషన్ టీచర్ పాడుపని..! ఏడు నెలల తరువాత నేరం వెలుగులోకి.....

Tuition Teacher rape: విద్యార్థినిపై ట్యూషన్ టీచర్ పాడుపని..! ఏడు నెలల తరువాత నేరం వెలుగులోకి.. !!

- Advertisement -

Tuition Teacher rape: మహిళలు, బాలికల సంరక్షణకు అనేక కఠన చట్టాలు ఉన్నప్పటికీ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులు, అత్యాచారాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ముఖ్యంగా ఏపిలో దిశ చట్టాన్ని తీసుకువచ్చి దిశ పోలీసు స్టేషన్ లను ఏర్పాటు చేశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగికదాడులకు పాల్పడితే వేగవంతంగా దర్యాప్తును పూర్తి చేసి త్వరితగతిన నేరం చేసిన వారికి శిక్షలు అమలు చేసేందుకు జగన్ సర్కార్ దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయినప్పటికీ ఇటీవల మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు జరుగుతునే ఉన్నాయి. కొందరు దుర్మార్ఘులు కామంతో కళ్లుమూసుకుపోయి మృగాళ్లుగా మారి చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో పెట్టే గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ యువకుడు.. తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   

వివరాల్లోకి వెళితే..విజయనగరం జిల్లా గంట్యాట ప్రాంతానికి చెందిన చిన్నా అనే యువకుడు బీఈడీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ లు చెబుతున్నాడు. వివాహితుడైన చిన్నా ఇంటి వద్ద ట్యూషన్ కు అనేక మంది పిల్లలు వస్తున్నారు. పిల్లలకు బాగానే పాఠాలు చెబుతున్నాడని పలువురు పదవ తరగతి పిల్లలను ట్యూషన్ కు పంపుతున్నాడు. ఇదే క్రమంలో ట్యూషన్ కు వచ్చిన పదవ తరగతి బాలికలపై కన్నేశాడు ట్యూషన్ మాస్టర్ చిన్నా. ఏడు నెలల క్రితం ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే పరీక్ష ఫెయిల్ చేయిస్తానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే గత కొద్ది రోజులుగా ఆ బాలిక అస్వస్థతకు గురి కావడం, కళ్లు తిరిగి పడిపోతుండటంతో పాటు పొట్ట కూడా ఎత్తుగా ఉండంటంతో అనుమానంతో కుటుంబ సభ్యులు  ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఏడవ నెల గర్భవతి అని చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ బాలికను నిలదీయడంతో ట్యూషన్ మాస్టార్ చిన్నా బాగోతం వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయనగరం దిశ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. బాలికలను చైతన్య పరిచేందుకు అవగాహన  కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.   

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...