Home వార్తలు ఐటీ అధికారికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

ఐటీ అధికారికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బందువుల ఐటీ శాఖ అధికారులు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కోట్లాది రూపాయల నగదు, ఆభరణాలు, విలువైన పత్రాలు సీజ్ చేశారు. అయితే విధి నిర్వహణలో ఉన్న తమపై మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేసి ల్యాప్ ట్యాప్, ఇతర పత్రాలు లాక్కున్నారనీ ఐటీ అధికారి రత్నాకర్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మరో పక్క మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి.. ఆసుపత్రిలో ఉన్న తన సోదరుడు మహేందర్ రెడ్డిని బెదిరించి దౌర్జన్యంగా ఐటీ అధికారి రత్నాకర్ సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులపై బోయినపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుందిగల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారి రత్నాకర్ .. మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రత్నాకర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల పాటు దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version