Sunday, April 28, 2024
Home వార్తలు జగన్ జనాన్ని నమ్ముకొలేదు…పోలింగ్ లో అక్రమాలనే నమ్ముకున్నారు : చంద్రబాబు

జగన్ జనాన్ని నమ్ముకొలేదు…పోలింగ్ లో అక్రమాలనే నమ్ముకున్నారు : చంద్రబాబు

- Advertisement -

వైసీపీ విధ్వంసం పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం టిడిపి,జనసేన,బిజెపి లు మళ్లీ చేతులు కలిపాయని టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు.రివర్స్ పాలనలో నష్టపోయిన రాష్ట్రంపై బాధ్యతతో…దుష్ట పాలనను అంతం చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయనీ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి కీలక కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికలకు సన్నద్దత, పొత్తులు, ఎన్నికల అభ్యర్థుల పనితీరుపై సూచనలు చేశారు.పలు సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు.ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా విధ్వంసం చేశారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే కేంద్ర సహకారం అవసరం. తెలుగు దేశం పార్టీ ఎన్డీఏలో గతంలో భాగస్వామిగా ఉంది. 25 ఏళ్ల క్రితమే ఎన్టీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పని చేసింది అని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాల ఆశించలేదు

- Advertisement -

పోలవరం పూర్తికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌళిక సదుపాయాల కల్పనకు కేంద్రసాయం ఎంతో అవసరం. మన ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులతో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు గ్రామాల్లో కనిపిస్తున్న ప్రతి రోడ్డు నాడు మన హయాంలో వేసినవే అని తెలిపారు.కేంద్ర ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉన్న ప్రతి సందర్భంలో రాష్ట్రానికి న్యాయం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు ఆశించని పార్టీ తెలుగుదేశం అని అందరికీ తెలుసు అని అన్నారు. మూడు పార్టీల పొత్తు జగన్ ను ఓడించడం కోసమే కాదు….రాష్ట్రాన్ని గెలిపించడం కోసం అని స్పష్టం చేశారు.రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయి…కింది స్థాయిలో నేతలు, కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాలని కోరారు. విభేదాలను పక్కన పెట్టి…..గెలుపు ఒక్కటే లక్ష్యంగా పనిచేయాలి.

- Advertisement -

ప్రజల్లో లేకపోతే మార్చడానికి వెనకాడను ..

- Advertisement -

ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ…ప్రతి సీటూ ముఖ్యమే. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలి. అనేక సర్వేలు చేసి, నూతన విధానాల ద్వారా అభ్యర్థులు ఎంపిక చేశాం….నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి…కూటమి 160 పైగా సీట్లు సాధించే విధంగా పని చేయాలన్నారు. అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో జోరు పెరిగింది…గ్రౌండ్ లో జోష్ వచ్చింది టిక్కెట్ పొందిన నేతల పనితీరుపై చివరి నిమిషం వరకు సమీక్షిస్తాం. ప్రజల్లో లేకపోయినా….మంచి పేరు తెచ్చుకోకపోయినా….మార్చడానికి వెనుకాడను అని హెచ్చరించారు.

రా కదలి రా…శంఖారావం సూపర్ హిట్ అయ్యాయి. కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపాయి. ప్రజలను చైతన్య పరిచాయి. ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుకు బాటలు వేశాయి. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా భువనేశ్వరి బాధిత కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికి 149 మంది బాధిత కుటుంబాలకు భువనేశ్వరి ఆర్థిక సాయం అందించారు. ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకునే వరకూ నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగుతుంది అని అన్నారు. చిలకలూరిపేటలో జరిగే 17వ తేదీ సభ కొత్త చరిత్ర సృష్టించాలి. ప్రజల భాగస్వామ్యంతో కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేసి సత్తా చాటాలి అని అన్నారు.విధ్వంస పాలనలో శిధిలంగా మారిన రాష్ట్రాన్ని నిలబెట్టడంలో తొలి అడుగే ఉమ్మడి సభ ప్రధాని పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా అని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మూడు పార్టీలు చేస్తున్న ప్రయత్నానికి ప్రతి పౌరుడు మద్దతుగా నిలవాలన్నారు.

జగన్ జనాన్ని నమ్ముకోలేదు…పోలింగ్ లో అక్రమాలనే నమ్ముకున్నాడు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి అని తెలిపారు. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని నియమించుకుని ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత వైసీపీ ఆగడాలు….తప్పుడు అధికారుల ఆటలు సాగవు అని అన్నారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు బస్సులు ఇచ్చేందుకు అంగీకరించారు…అధికారులు అంతా ఆలోచించుకోవాలి. మాకు మద్దతుగా ఉండమని కోరడం లేదు….చట్టబద్దంగా పని చేయమని కోరుతున్నాం అని అన్నారు. ప్రజలు మూడు పార్టీల పొత్తును స్వాగతిస్తున్నారు….వారికి నాయకత్వాన్ని ఇచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పోలింగ్ ముగిసే రోజు వరకు ఏ కార్యకర్తా…ఏ నాయకుడు విశ్రమించవద్దు…..టీడీపీ, బిజెపి, జనసేన గెలుపు ఇప్పుడు చారిత్రిక అవసరం.సూపర్ సిక్స్ డోర్ టు డోర్ ప్రచారంలో పనితీరు కనబరిచిన వారిని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. క్లస్టర్, యూనిట్, బూత్ లెవల్ (cub) వరకు 56 వేల మంది పార్టీ యంత్రాంగం టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

Most Popular

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...