Home వార్తలు మే ఒకటనే ఫించన్లు పంపిణీ చేయాలి : దేవినేని ఉమా

మే ఒకటనే ఫించన్లు పంపిణీ చేయాలి : దేవినేని ఉమా

రాష్ట్రంలో మే ఒకటవ తారిఖునే ఫించన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వేసవి దృష్ట్యా పెన్షన్ దారులుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు ఇంటికే వెళ్లి పెన్షన్ అందించాలని కోరారు. సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులును సమన్వయం చేసుకొని ఫెన్షన్ల అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం మంగళగిరిలోని టీడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….పెన్షన్ ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శవ రాజకీయం చేసే అవకాశం ఉందని మార్చి నెలలోనే ఫిర్యాదు చేసినా….ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోకుండా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డిలు అధికార పార్టీకి అనుకూలంగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అవ్వా తాతల మరణానికి కారణం అయ్యి పక్కకి వైదొలగకుండా ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్ దారుల ఇంటింటికీ వెళ్ళి ఫించన్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని త్వరలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారినీ కలిసి కొరతమన్నారు.

రాష్ట్రంలో రూ. 200 ఉన్న పెన్షన్ ను 2000 రూపాయలు చేసిన ఘనత టిడిపిదని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ ….చివరకి 58 నెలలకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. 2014 లో రాష్ట్ర బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉండగా.. టిడిపి ప్రభుత్వం 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 12 లక్షల కోట్ల బడ్జెట్ లో ఎన్ని కొత్త పెన్షన్ న్లు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో పెన్షన్ దారులకు ప్రతి నెల రూ.4000 పెన్షన్లు అందిస్తామని తెలిపారు.

Exit mobile version