Home వార్తలు ఉన్నతాధికారిపై దురుసు ప్రవర్తన .. తర్లుపాడు తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు

ఉన్నతాధికారిపై దురుసు ప్రవర్తన .. తర్లుపాడు తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు

ప్రకాశం జిల్లా తర్లపాడు తహశీల్దర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సమీక్షా సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ తో దురుసుగా మాట్లాడిన ఫలితంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆయనను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వళితే ఈ నెల 15వ తేదీన మార్కాపురం డివిజన్ పరిధిలోని మండల తహశీల్దార్ లతో స్పందన, ముటేషన్లు, సచివాలయ సేవలు, నీటి తీరువా వసూళ్లు, మీసేవ తదితర అంశాలపై సబ్ కలెక్టర్ సేతు మాధవన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమయంలో తర్లుపాడు తహశీల్దార్ పివి కృష్ణారెడ్డి పనితీరుపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ తో నన్నే అలా మాట్లాడతారా అంటూ తహశీల్దార్ వాదనకు దిగి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లు తెలిసింది. తహశీల్దార్ ప్రవర్తించిన తీరును వివరిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ దినేష్ కుమార్ కు సబ్ కలెక్టర్ సేతు మాధవన్ నివేదిక సమర్పించారు. దీంతో తహసీల్దార్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి డిప్యూటి తహశీల్దార్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు.

Exit mobile version