Home వార్తలు ఓట్ల తొలగింపుపై ఈసీకి మరో మారు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖ

ఓట్ల తొలగింపుపై ఈసీకి మరో మారు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖ

ఓట్ల తొలగింపులో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరో మారు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) లేఖ రాశారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పర్చురు నియోజకవర్గంలో ఏడు వేల ఓట్లు తొలగించేందుకు అధికార వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓట్ల తొలగింపులో అధికారుల ప్రమేయం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని బూత్ లలో ఒకే వ్యక్తి పేరుతో ఆన్ లైన్ లో వందల సంఖ్యలో ధరఖాస్తులు చేశారనీ, ఎటువంటి ఆధారాలు లేకుండా చేసిన ఈ దరఖాస్తులపై విచారణ జరిపాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆన్ లైన్ లో వచ్చిన ఇటువంటి దరఖాస్తుల వివరాలను ఎమ్మెల్యే సాంబశివరావు లేఖలో పేర్కొన్నారు. రాజకీయ లబ్దికోసమే ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తొందని మండిపడ్డారు. పర్చూరులో నిబంధనలకు విరుద్దంగా పెద్ద సంఖ్యలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని ఇటీవల ఈసీకి లేఖ రాసిన ఏలూరి సాంబశివరావు ఇప్పుడు మరో సారి లేఖ రాశారు.

ఇటీవల మంత్రి సిదిరి అప్పలరాజు వైసీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఓట్ల తొలగింపుపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.  నియోజకవర్గంలోని గ్రామాల్లో ఓట్లు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారి ఓట్ల తొలగింపునకు అప్లికేషన్ లు పెట్టాలని సూచించారు. మన (వైసీపీ)కి ఓట్లు వేస్తారనున్న వారి ఓట్లు ఉంచి ఇతర పార్టీలకు ఓట్లు వేసే వారు అయితే వాళ్ల ఓట్లు తొలగించేందుకు అప్లికేషన్ రైజ్ చేయాలని చెప్పారు. ఆ మంత్రి సూచనలను దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఫాలో అవుతున్నాట్లున్నారు.

Exit mobile version