Thursday, May 2, 2024
Home వార్తలు ఒంగోలు వైసీపీలో విషాదం: నగర పార్టీ అధ్యక్షుడు ఆకస్మిక మరణం..!

ఒంగోలు వైసీపీలో విషాదం: నగర పార్టీ అధ్యక్షుడు ఆకస్మిక మరణం..!

- Advertisement -

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు వైసీపీలో విషాదం నెలకొంది. వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఇవేళ తెల్లవారుజామున మృతి చెందారు. వెంకట్రావు గత కొద్ది నెలలుగా బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే అతనికి కాన్సర్ సోకిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.

సింగరాజు వెంకట్రావు వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. నగరంలో పార్టీకి గట్టిగా పని చేయడంతో నగర పార్టీ అధ్యక్షుడుగా నియమితులైయ్యారు. సింగరాజు వెంకట్రావు మృతితో ఒంగోలు వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. కాగా రేపు మాజీ మంత్రి బాలినేని కుటుంబ సమేతంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్న తరుణంలో ఈ విషాద ఘటన జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...