Monday, April 29, 2024
Home వార్తలు సిఎం పై దాడి వివరాల గురుంచి ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కీలక ప్రకటన

సిఎం పై దాడి వివరాల గురుంచి ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కీలక ప్రకటన

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినవారి వివరాలను తెలిపినవారికి రెండు లక్షల నగదును బహుమతిగా అందిస్తామని ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌వారి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 13 వ తేదిన విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వైయస్ జగన్మోహన్‌ రెడ్డి పై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి దోహదపడే కచ్చితమైన సమాచారమును, దృశ్యాలను అందించవచ్చునని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన కచ్చితమైన సమాచారము అందించే వారు ఫోన్‌ ద్వారా గాని, వాట్స్‌ అప్‌ ద్వారా గాని, లేదా నేరుగా గాని వచ్చి తెలియజేయగలరని వివరించారు.ఫోన్‌ నెంబర్లు కంచి శ్రీనివాసరావు, డి.సి.పి. ఎన్‌.టి.ఆర్‌. పోలీస్‌ కమిషనరేట్‌ 9490619342.ఆర్‌.శ్రీహరిబాబు, ఏ.డి.సి.పి.టాస్క్‌ ఫోర్సు 9440627089 ఆఫీస్‌ అడ్రస్‌ : కమిషనర్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్‌, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట్‌, కృష్ణలంక, విజయవాడ. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చునని తెలిపారు.. ఈ సమాచారమును అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...