Monday, April 29, 2024
Home వార్తలు ఆర్థిక సంఘం నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి : ఆంధ్రపదేశ్ పంచాయతీ రాజ్

ఆర్థిక సంఘం నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి : ఆంధ్రపదేశ్ పంచాయతీ రాజ్

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు పంపిన రూ.988 కోట్ల రూపాయలును వెంటనే గ్రామ పంచాయతీ పి.ఎఫ్.ఎం.ఎస్ ఖాతాల్లో జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ కోరారు. సోమవారం సర్పంచుల సంఘం ప్రతినిధి బృందం వెలగపూడి లోని సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులని దారి మళ్ళించడానికి అలవాటుపడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయలేదన్నారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా గత మూడేళ్లుగా 14,15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం 12,918 గ్రామాలలో నివసిస్తున్న మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కొరకు పంపిన 8629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, సర్పంచుల సంతకం లేకుండా గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా దొంగిలించి సొంత పథకాలకు వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా గ్రామీణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని వాపోయారు.

3.50 కోట్ల గ్రామీణ ప్రజలకు వేసవికాలంలో త్రాగునీరు అందించాలంటే సర్పంచుల దగ్గర నిధులు లేని పరిస్థితి ఉందన్నారు. గ్రామీణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి ఉపాధ్యక్షులు గోగినేని వసుధ, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనంజయ యాదవ్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి గల్లా తిమోతి, కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పానేని రవి ప్రసాద్, కార్యదర్షి హెలినా,గుంటూరు, కృష్ణా ,పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కల్లూరు శ్రీనివాస్, గోలి వసంత కుమార్, పాలడుగుల లక్ష్మణరావు,ఎన్.వి.సుబ్బారావు, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి యలపర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...