Home వార్తలు డిజిపి..సిఎస్ లను తప్పించండి….రాళ్ళ దాడిపై కూటమి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు

డిజిపి..సిఎస్ లను తప్పించండి….రాళ్ళ దాడిపై కూటమి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు

ప్రజా గళం, వారాహి విజయ యాత్ర లో భాగంగా టిడిపి , జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన కళ్యాణ్ ల మీద జరిగిన రాళ్ళ దాడిపై ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఓ పెద్ద నాటకం అని పేర్కొన్నారు. రాయి దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ తో కాకుండా సిబిఐ తో విచారణ చేయించాలని కోరారు. అనంతరం మీడియా సమావేశంలో టీడిపి పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ…ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు జగన్ రెడ్డి డ్రామా ఆడారని విమర్శించారు. నిజానికి ఎవరు రాయి తో దాడి చేయలేదని తెలిపారు. కోడికత్తి కేసులో అమాయకుడైన శ్రీనివాస్ ను ఏ విధంగా ఐతే జైల్లో పెట్టారో…నేడు ఒక అమాయకుడిని పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే డిజిపిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి లను ఎన్నికల విధులనుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వారిలో బోండా ఉమామహేశ్వర రావు, కొనకళ్ళ నారాయణ,ఏం.షరీఫ్,పాతూరి నాగభూషణం ఉన్నారు.

Exit mobile version