Sunday, April 28, 2024
Home వార్తలు అనుమానాస్పద,అధిక లావాదేవీల వివరాలను అందజేయండి : ముకేశ్ కుమార్ మీనా

అనుమానాస్పద,అధిక లావాదేవీల వివరాలను అందజేయండి : ముకేశ్ కుమార్ మీనా

- Advertisement -

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్ కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి మరియు 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు అయిన బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి లోక్ సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. అయితే అంతకు మించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటి కప్పుడు ఐ.టి. శాఖతో పాటు తమకు అందజేయాలన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్ష రూపాయలకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అదిక మొత్తంలో నగదు, లిక్కరు మరియు ఓటర్లను ప్రలోభపర్చే సామాగ్రి అక్రమ తరలింపుపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందన్నారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్ లో నివేదించేందుకు ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ విధానాన్ని భారత ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబందించి ఐ.టి., జి.ఎస్.టి., పోలీస్, ఎక్సైజ్ తదితర 22 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వారు సీజ్ చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్ లో ఫీడ్ చేయడం జరుగుతుందన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్ ను పటిష్టంగా వినియోగించుకునేందుకు ఈ యాప్ లోకి లాగిల్ అవ్వాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్ఎంఎస్ యాప్ ను వినియోగించుకోవచ్చన్నారు. ఈఎస్ఎంఎస్ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రసీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

Most Popular

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...