Home వార్తలు దళితులకు న్యాయం జరిపించటంలో ప్రభుత్వం విఫలం : కెవిపిఎస్

దళితులకు న్యాయం జరిపించటంలో ప్రభుత్వం విఫలం : కెవిపిఎస్

శిరోముండనం కేసులో దళితులకు న్యాయం జరిపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కెవిపిఎస్ విమర్శించింది. నిందితుడు తోట త్రిమూర్తులకు కఠినంగా శిక్షించాలిసింది పోయి… 18 నెలల జైలుశిక్ష, రెండు లక్షల యాబై వేలు జరిమానా విధించడం దళితుల మనోధైర్యం దెబ్బతీసేదిగా ఉందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అద్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప అండ్ర మాల్యాద్రి తెలిపారు.కోర్టు విధించిన శిక్ష పట్ల కెవిపియస్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది అని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తీర్పు పై ప్రభుత్వం అప్పిలుకు వెళ్లి కఠిన శిక్ష ఖరారయ్యే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. 28 సంవత్సరాల క్రితం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా జరిగిన ఈ అనాగరికమైన దాడిపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులోనే తీర్పు ఇంత ఆలస్యంగా వచ్చిందంటే ఇక దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కనీసం ఆలస్యమైనా పూర్తిస్థాయి న్యాయం జరగకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.27 సంవత్సరాల పాటు ఓపికగా పోరాడిన వెంకటాయిపాలెం దళితులకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం అభినంధనలు తెలుపుతుందని తెలిపారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ దళితులపై జరుగుతున్న దుర్మార్గమైన దారుణమైన కులదురంకార ఆకృత్యాలను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇటువంటి అకృత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగంపై ఉంది. కానీ ఇందుకు భిన్నంగా చట్ట విరుద్ధంగా ఇలాంటి ఘటనలో ప్రభుత్వం, పోలీసు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సాక్ష్యాధారాలు సేకరించకుండా, సాక్షులను బెదిరించి, ఎదురు కేసులు పెట్టి రకరకాల పద్ధతుల్లో లొంగదీసుకుని శిక్షలు పడకుండా పెత్తందారులు చూస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని హత్య చేసి ఈరోజు దర్జాగా బెయిల్ మీద తిరగటమే కాకుండా ఎన్నికల్లో ప్రత్యర్థులను బెదిరించటం, అక్రమాలు చేయటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం చూస్తున్నాము. దళిత ఉద్దరణ గురించి మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా దళితులకు అండగా నిలబడతామని నిరూపించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.

Exit mobile version