Home వార్తలు గోటబయు రాజపక్స బాటలో జగన్ : పవన్ కళ్యాణ్

గోటబయు రాజపక్స బాటలో జగన్ : పవన్ కళ్యాణ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి డబ్బులు పంచుతూ సంక్షేమం అంటున్నారు …అధి సంక్షేమం అవ్వదు.ఆ అప్పులను కట్టాల్సింది ప్రజలే.అప్పులు చేసి డబ్బులు పంచుకుంటూ పోతే శ్రీలంక అధ్యక్షుడు గోటబాయు రాజపక్స ప్యాలెస్ ను ప్రజలు ఎలా ఆక్రమించారో…రాష్ట్రంలో సిఎం నివాసం అయిన తాడేపల్లి ప్యాలెస్ ను కూడా రాష్ట్ర ప్రజలు అలాగే ఆక్రమిస్తారని జనసేన అధినేత పవన కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా గురువారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో ఆయన జనసేన సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దశాబ్ద కాలంలో జనసేన పార్టీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగింది.కష్టాల సమయం ఐపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నం. రాష్ట్ర భవిషత్తు కు భరోసా ఇచ్చేలా ముందుకు ముందుకు సాగుదాం అని పిలుపుచ్చారు.


జనంతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వం కూలిపోతుంది

సీఎం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారు..అందుకే సిద్ధం సిద్ధం అంటున్నారని ఎద్దేవా చేశారు. మేదరమెట్ల సిద్ధం సభకు 15 లక్షలు మంది హాజరయ్యారు అంటూ వైసిపి రకరకాల గ్రాఫిక్స్ మతాలను ఉపయోగించి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించిందని ఎద్దేవా చేశారు.
అధికార దాహం, మదంతో రాష్ట్ర ప్రజలను కన్నీరు పెట్టించిన వైసిపి ప్రభుత్వం …ఆ కన్నీటి తోనే కూలిపోతుంది అని ద్వజమెత్తారు. పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు,వీర మహిళలు మీద పడిన ప్రతి దెబ్బకి కచ్చితంగా సమాధానం చెప్పి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర క్షేమం కోసమే సీట్ల త్యాగం

రాజ్య క్షేమం కోసం ఒక గ్రామం పోయినా ఫర్వాలేదని విదుర నితిలో ఉంది. ఆ స్పూర్తితోనే ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం సీట్ల విషయంలో కొన్ని త్యాగాలు చేశామని తెలిపారు. గత ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చాం.ప్రస్తుత రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులో భాగంగా కొందరికి అవకాశం కల్పించలేక పోయాం అని తెలిపారు. చివరకి తన సోదరుడు నాగబాబు కూడా సీటు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. తగ్గిన వాడు ఎప్పుడు నాశనం అవ్వడు..తగ్గే కొద్దీ ఎదుగుతం తప్ప ఏ అనర్థం ఉండదని సూచించారు. నేటి సమాజంలో సోషల్ మీడియా అనేది బలమైన వేదిక.కత్తిని తీసుకువెళ్ళి జగన్ చేతిలో పెడితే బాబాయ్ ని చంపేశారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగిస్తే అద్భుతాలు జరుగుతాయి అని తెలిపారు.

బంగారు భవిష్యత్తుకు బాధ్యత తీసుకుంటాను

పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడు ఏమీ అడగలేదు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తును గెలిపించండి అని అడుగుతున్నా..జనసేన ను ఆశీర్వదించండి. అధికారం లేనప్పుడే ప్రజల కోసం ఆలోచించే వాడిని, అధికారం ఉంటే ప్రజలకు మరింత గా ఉపయోగపడవచ్చు అనే ఉన్నత ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈసారి జనసేన పార్టీకి బలంగా నిలబడండి. రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను అని కోరారు.

Exit mobile version