Home వార్తలు అరాచక పార్టీతో పోరాడుతున్నాం : పవన్ కళ్యాణ్

అరాచక పార్టీతో పోరాడుతున్నాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా అరాచకం, హింస,కక్ష సాధింపు లను నమ్ముకున్న వైసిపి తో జనసేన,టీడిపి,బిజెపి పార్టీలు పోరాడుతున్నాయని…రానున్న ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా అడుగు వేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకులకు సూచించారు. మంగళగిరిలో ని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులతో ఆయన సమావేశం అయ్యారు. ఎన్నికల నియమావళి లో నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకు ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు గురుంచి తెలిపి పార్టీ భిపారం లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల దశలో అభ్యర్థులు,నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేస్తూ.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అధికార పార్టీ నుంచి ఎటువంటి ఒత్తిల్లు వస్తే పార్టీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. టీడిపి,బీజీపీ ల నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఇంఛార్జి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ, రాజానగరం ఇంఛార్జి బత్తుల బల రామకృష్ణ, నెల్లిమర్ల ఇంఛార్జి లోకం మాధవి ,మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు,బొలిసెట్టి శ్రీనివాస్ ,వంశీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version