Home వార్తలు పులివెందులలో పోటీకి సామాన్యుడుకు అర్హత లేదా ? : దస్తగిరి

పులివెందులలో పోటీకి సామాన్యుడుకు అర్హత లేదా ? : దస్తగిరి

పులివెందులలో పోటీ చేయబోయే దస్తగిరి నీ కొడుకేనా? మా అన్న జగన్ మీద పోటీ చేసేంత మొగోడా వాడు.నిన్ను వాడ్ని అందర్నీ చంపుతామని అని ముగ్గురు వైసిపి అనుచరులు శివరాత్రి ఉత్సవాల్లో ఉన్న తన తండ్రి హజపీరాను బెదిరించి కత్తితో దాడి చేసారని జై భీం భారత్ పార్టీ పులివెందుల ఇంఛార్జి దస్తగిరి ఆరోపించారు. తనను పులివెందులలో పోటీ చేయనియ్యకుండా అడ్డుకోవటానికి ,హత మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.ఒక సామాన్యుడు పులివెందలో పోటీ చేసే అర్హత లేదా అని ప్రశ్నించారు. తన తండ్రి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలతో కూడిన రాజకీయ పార్టీలో ఉన్నాం కనుక ..మీలాంటి దాడులు మాకు సరిపడవని పేర్కొన్నారు. తన తండ్రి కి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.

తాను పులివెందులలో జగన్ మీద పోటీలో ఉంటే అతను ఒడిపోయే పరిస్థితి ఉంటుందని, అందుకు భయబ్రాంతులకు గురైన జగన్ రెడ్డి ,అవినాష్ రెడ్డి తన పై,తన కుటుంబం పై పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. నా మీదకు కానీ నా కుటుంబం మీదకి వస్తే ఎవరని వదలనని హెచ్చరించారు. తన తండ్రి మీద జరిగిన దాడిపై పిటిషన్ వేస్తామని అన్నారు…ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదని, భయపడే పరిస్థితి లేదు. మీకు చేతనైతే నన్ను ఏమైనా చేయండి..నా కుటుంబం జోలికి రావద్దు అని హెచ్చరించారు.

అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉండటం వలనే దాడులు

అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయట ఉండటం వలనే తనపై, తన కుటుంబం మీద దాడులు జరుగుతున్నాయని,వివేక హత్య కేసులో సరిగా విచారణ జరగడం లేదన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాలని,అందుకు సుప్రీం కోర్టు ను ఆశ్రయిస్తామని తెలిపారు. తను జైలు లో ఉండగా హత్య ప్రయత్నం చేసేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసేందుకు వైసిపి నాయకులు పన్నాగం పన్నుతున్నారని తెలిపారు.

Exit mobile version