Home వార్తలు Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ..ఆరుగురు మృతి

Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ..ఆరుగురు మృతి

Fire Accident: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని రసాయన కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 14 మందికిపైగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో కింద విభాగంలో పని చేస్తున్న కార్మకులు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను, మృతుల వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని తొలుత నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తొంది. మృతుల్లో నలుగురు బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు.

ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భాంతి .. మృతుల కుటుంబాలకు 25 లక్షల వంతున పరిహారం

ఏలూరు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంత వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల వంతున పరిహారం ప్రకటించారు. ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

బుధవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా 13 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులు నూజివీడు, విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Exit mobile version