Home వార్తలు bomb threat call: బాంబు బెదిరింపుతో రైళ్లలో విస్తృతంగా తనిఖీలు

bomb threat call: బాంబు బెదిరింపుతో రైళ్లలో విస్తృతంగా తనిఖీలు

bomb threat call: రైైలులో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తం అయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 00 కి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన రైల్వే పోలీసులు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే రైళ్లను ఆపి తనిఖీలు చేశారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తున్న ఎల్టీజీ ఎక్స్ ప్రెస్ ను కాజీపేటలో నిలుపుదల చేసి తనిఖీ లు చేపట్టారు.

చర్లపల్లిలో కోణార్క్ ఎక్స్ ప్రెస్, కాజీపేటలో తోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను నిలుపుదల చేసి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, రైల్వే పోలీసులు జాగిలాలతో అన్ని బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను పరిశీలించారు. పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైయ్యారు. అయితే ఏ రైలులోనూ బాంబులు దొరకకపోవడంతో పోలీసులు, రైల్వే పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇతర రైళ్లను తనిఖీలు చేశారు. ఇది ఫేక్ కాల్ గా అధికారులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది. ఎవరు చేశారు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version