Home వార్తలు రాజ్యంగ లౌకిక సూత్రాన్ని ఉల్లంఘిస్తున్న సిఎఎ : సిపిఎం

రాజ్యంగ లౌకిక సూత్రాన్ని ఉల్లంఘిస్తున్న సిఎఎ : సిపిఎం

పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఎఎ ఉల్లంఘిస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తూ న్నామని పేర్కొన్నారు. సిఎఎ చట్టం కింద నోటిఫై చేసిన నియమాలు.. పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల వివక్షాపూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్లిం మూలాలు ఉన్న పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనలను పెంచుతోంది.

తమ రాష్ట్రంలో పౌరసత్వం కోసం వ్యక్తులను గుర్తించే, నమోదు చేసే ప్రక్రియ నుండి రాష్ట్ర ప్రభుత్వాల్ని మినహాయించే విధంగా ఈ నిబంధనలు రూపొందించడ్డాయి అని పేర్కొన్నారు. సిఎఎని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించడానికే ఈ నిబంధనలు రూపొందించబడ్డాయని స్పష్టమౌతోంది అని అన్నారు. సిఎఎను ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు ఈ చట్టం నిబంధనల నోటిఫికేషన్‌ వెలువడటం అంటే, తమ ప్రయోజనాల కోసం సిఎఎ అమలును ఉపయోగించాలని బిజెపి కోరుకుంటుందని స్పష్టమౌతోంది. సిఎఎ అమలును, ఈ హానికరమైన ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాడతామని తెలిపారు. ఐతే …ఈ చట్టాన్ని అమలు చేయబోదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాలు కూడా సిఎఎను తీవ్రంగా వ్యతిరేకించాయి.

Exit mobile version