Saturday, May 4, 2024
Home వార్తలు Breaking: మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపి సీఐడీ అధికారులు

Breaking: మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపి సీఐడీ అధికారులు

- Advertisement -

Breaking: ఏపి సీఐడీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్న నారాయణను సీఐడీ అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిసింది. ఈ నేపథ్యంలో ఏపి సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్ కొండాపూర్ కు వెళ్లి నారాయణ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఏపిలో పదవ తరగతి పరీక్షల ప్రారంభంలో పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నా పత్రాలను వాట్స్ ఆప్ ద్వారా బయటకు పంపిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది.

- Advertisement -

ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. ప్రశ్నా పత్రాల లీకేజీ అంశంలో పది మందికిపైగా ఉపాధ్యాయులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ప్రస్తుతం నారాయణను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు అనే విషయాన్ని సీఐడీ అధికారులు వెల్లడించలేదు. ఆయన సొంత కారులోనే హైదరాబాద్ నుండి ఏపికి తరలిస్తున్నారు ఏపీ సీఐడీ అధికారులు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....