Sunday, April 28, 2024
Home వార్తలు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి : వాసిరెడ్డి పద్మ

మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి : వాసిరెడ్డి పద్మ

- Advertisement -

సమాజంలో మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. గురువారం విజయవాడ సభ్ కలెక్టర్ ప్రాంగణ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం అధ్వర్యంలో మహిళావిభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మి అధ్యక్షతన,ప్రధానకార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి ఆద్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.ఈ వేడుకులకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ , విజయకృష్ణన్,, డైరెక్టర్,సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమానికి హాజరై మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ….మహిళల్లో ఉద్యోగుల పాత్ర మరింత బాధ్యతగా ఉంటుందని వారు కుటుంబాల్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని, అందువలన ఈ ప్రభుత్వం చాలా అంశాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వడం, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. మరొక ముఖ్యఅతిథి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ…. ప్రధమంగా మహిళలు తమ తమ ఆలోచనలకు తగ్గట్టుగా, వారి వారి వ్యక్తిత్వాన్ని వారే గౌరవించుకోవాలని, మనం నిర్వహించే ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రతిక్షణం సంతోషంగా గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఏపిజేఏసి అమరావతి మహిళా విభాగం ఆద్వర్యంలో నేడు విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళాధినోత్సవ వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉందని, నిరంతరం ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి,అందులోను మహిళా ఉద్యోగులు విధినిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు పైన,చట్టప్రకారం మహిళలకు రావల్సిన హక్కులూ సాధన కోసం బొప్పరాజు ఆద్వర్యంలో జరుగుతున్న కృషి అభినందనీయమని కొనియాడారు

- Advertisement -

ఈసమావేశంలో మరో ముఖ్యఅతిధిగా పాల్గోన్న ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… నేడు ప్రతి మహిళా కూడా మట్టి పనులు నుండి అంత రిక్షంలోకి వెళ్లే ఏపని నైనా సునాయాసంగా చేస్తున్నారు. విధ్యరంగంలో కూడా పదవతరగతి నుండి ఐఎయస్ & ఐపియస్ స్దాయి వరకు పురుషులకంటే ముందుంజలో ఉంటున్నారు.అలాగే ఉద్యోగవర్గంలో కూడా ప్రస్తుతం అన్ణి డిపార్టుమెంటులలో 50 శాతానికి చేరుకోవడం చాలా ఆనందదాయకమని స్త్రీలు ఎక్కడ గౌరవీంచబడతారో అక్కడే అన్ని అక్కడే అంతా మంచి జరుగుతుందని అన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగ సంఘాల నాయకత్వంలో కూడా సింహభాగం ఇప్పుడు మహిళా విభాగంలో ఉన్న నాయకులు వస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు.

- Advertisement -


అలాగే ప్రస్తుతం ఇస్తున్న చైర్డుకేర్ లీవు ను పిల్లలకు 18 సంవత్సరాలు వయస్సు వరకు మాత్రమే వర్తింప జేస్తున్న విధానాలు మార్పు చేసి సర్వీసులో ఉండగా ఎప్పుడైనా వాడుకొనేలా నిబందనలు మార్పుకోసం అలాగే కేంద్రప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇస్తున్న రెండు సంవత్సరాలు చైల్డుకేర్ లీవ్ ను ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళా ఉద్యోగులకుఅవర్తిం జేయాలని ఏపిజేఏసి అమరవాతి రాష్ట్రకమిటి తరుపు కృషిచేస్తున్నామని బొప్పరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో గత రెండు రోజుగా ఉత్సాహంగా కొనసాగిన క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రధానంగా మహిళా ఉద్యోగినులకు ట్రెడిషనల్ డ్రెస్, టగ్ ఆఫ్ వార్, బాల్ త్రోయింగ్ , క్విజ్ కాంపిటేషన్ మొదలగు పోటీలు జరిగాయి. ఈ పోటీలలో వందల సంఖ్యలో మహిళా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు, ఇందులో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులు మరియు ఏపీ జెఎసి అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బహుమతులు ప్రధానం చేసారు.

- Advertisement -

ఈకార్యక్రమంలో ఏపిజెఏసి అమరావతి
మహిళా విభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మీ, ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి,అసోషియేట్ చైర్మన్ సైకం శివకుమార్ రెడ్డి,కోశాధాకారి పి.పావనితో పాటు క్యాపటల్ సిటి చైర్ పర్సన్ పి.శ్రీదేవి ,ప్రధానకార్యదర్శి యం.వాణి, ఏపీ జేఏసీ అమరావతి అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశిధికారి వి.వి.మురళికృష్టనాయుడు తో పాటు ఏపిరెవిన్యూ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్రప్రధాకార్యదర్శి కె.రమేష్ కుమార్,మున్సిఫల్ ఎంఫ్లాయీస్ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ దొప్పలపూడి, ఏపీ జేఏసీ అమరావతి యన్టీఆర్ చైర్మన్ బత్తిన రామకృష్ట , ప్రధానకార్యదర్శి వై.శ్రీనివాసరావు, క్యాపటల్ సిటి యూనిట్ చైర్మన్ రామిసెట్టి దుర్గా ప్రసాద్, జెనరల్ సెక్రటరీ మందపాటి శంకరరావు, రెవిన్యూ అసోషియేషన్ యన్టీఆర్ జిల్లా అధ్యక్షులు డి .శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

Most Popular

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...