Friday, May 10, 2024
Home వార్తలు కుప్పం కు మేలు చేయని చంద్రబాబు ముఖ్యమంత్రికి అర్హుడా ? జగన్మోహన్ రెడ్డి

కుప్పం కు మేలు చేయని చంద్రబాబు ముఖ్యమంత్రికి అర్హుడా ? జగన్మోహన్ రెడ్డి

- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కొండలు గుట్టలు దాటుకొని 672 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుప్పం కు నీళ్ళు అందించిన ఘనత వైయస్సార్ ప్రభుత్వం కే దక్కుతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం లో గండిశెట్టి పల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…హంద్రీ నీవా సుజల స్రవంతి లో భాగంగా కృష్ణమ్మ ను కుప్పం నియోజకర్గంలోకి ప్రవేశించిందని తెలిపారు.రెండేళ్ల క్రితం కుప్పంలో జరిగిన సభలో …కృష్ణ జలాలును కుప్పం నియోజకవర్గంకు తెస్తామని ఆ రోజు మాట ఇచ్చాము…ఇచ్చిన హామీ మేరకు నేడు ఆ మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు.

నీరు పారే కాలవులు కాదు…నిధులు పారే కాలవులు

- Advertisement -

చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేసి దోచేసుకున్నారని మండిపడ్డారు.మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కుప్పం నియోజకవర్గంకు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కు ప్రయోజనం లేని నాయకుడు వలన రాష్ట్రానికి ఎం ప్రయోజనం ఉంటుంది అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాన్ని నీరు పారే కాలువులుగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలవులుగా మార్చుకున్నన్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు కాంట్రాక్ట్ లు ఇచ్చే సందర్భంలో ఎవరికి ఇవ్వాలి…అంచనాలు ఎంత పెంచాలి…మట్టి పనులు ఎంత పెంచుకోవాలి…ఎంత ముడుపులు పుచ్చుకోవాలి అనే అంశం మీదనే చంద్రబాబు పరిశోధన చేశారని మండిపడ్డారు. కుప్పం, పలమనేరు ప్రజలకు తాగునీరు,సాగు నీరు అందించాలనే అనే అంశం మీద చంద్రబాబుకు దృష్టి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

- Advertisement -

ఎవరి పాలనలో కుప్పం అభివృద్ధి

కుప్పం ,పలమనేరు ప్రజలు కలలుగన్న స్వప్నాన్ని పూర్తి చేసింది చిత్త శుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పటానికి గర్వపడుతున్నాను అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015 లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తరువాత రకరకాలు కారణాలు చెప్పి చంద్రబాబు అంచలనాలు వ్యయం 561 కోట్ల రూపాయలుకు కు పెంచుకుంటూ పోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే పనులను చేసి మాత్రమే చేసి….మిగిలిన ముఖ్యమని పనులు వదిలేసి..తన అస్మధియ కాంట్రాక్టర్ల కు కోట్ల రూపాయలను సొమ్మును దోచిపెట్టారని మండిపడ్డారు.

కుప్పం ప్రజలకు జోహార్లు

కుప్పం నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తి ని కూడా తీర్చని చంద్రబాబుని ఇంతకాలం భరించిన నియోజక వర్గ ప్రజల సహనానికి,మంచితనానికి తన జోహార్లు అని తెలిపారు. ఎవరి పరిపాలనలో కుప్పం కు మేలు జరిగింది అన్నది ఆలోచన చేయాలి అని పేర్కొన్నారు.35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ..14 ఏళ్లు సిఎం గా ఉన్నడగ కుప్పానికి మంచి జరిగిందా?లేక కేవలం 58 నెలలు మాత్రమే ముఖ్యమంత్రి అయిన తరువాత మేలు జరిగిందా ఆలోచన చేయండి అని అడుగుతున్నా. కుప్పం లోకి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది, మున్సిపాలిటీ గా మార్చింది, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది అన్నిటికీ సమాధానం మీ జగన్ అని పేర్కొన్నారు. హెరిటేజ్ డైరీ లాభ కోసం మూసేసిన చిత్తూరు డైరీ ను తెరిపించడమే కాకుండా, దేశంలో అతి పెద్ద సహకార రమగం అయిన అమూల్ ను తీసుకువచ్చి కుప్పం,పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరలు ను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అంటే మీ జగన్ అని అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...