Home విశ్లేషణ Silica Land Scam: నేతల సిలికా పాప ఫలితం.. చినగంజాం తహసీల్దారు సస్పెండ్..!

Silica Land Scam: నేతల సిలికా పాప ఫలితం.. చినగంజాం తహసీల్దారు సస్పెండ్..!

Silica Land Scam: MRO Suspension
Silica Land Scam: MRO Suspension

Silica Land Scam: అది అక్రమమని తెలుసు.. కోర్టులు తప్పు పడతాయని తెలుసు.. చూస్తూ చూస్తూ రైతులకు అన్యాయం జరుగుతుందని తెలుసు… అయినా నాయకులు ఒత్తిడి చేసారు.. అధికారి తప్పని తెలిసినా తలొంచారు.. చివరికి సస్పెండ్ అయ్యారు.. చినగంజాం తలసీల్దారు విజయకుమారి కథ ఇదీ..! ఈ మండలంలోని మోటుపల్లి గ్రామంలోని 115 సర్వే సంఖ్యలో సిలికా ఇసుక వనరులుండే భూములున్నాయి. ఈ భూములను ఎవ్వరికీ లీజుకి ఇవ్వకూడదు. అలా ఇవ్వడం సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. అందుకే 2008లో ఓ సారి.., 2016లో ఓ సారి అప్పటి అధికార పార్టీల నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారులు అంగీకరించలేదు. కానీ ఈ నాయకులు ఒత్తిడి చేయడం.., ఆ అధికారి నిరభ్యంతరంగా “నిరభ్యంతర పత్రం” ఇచ్చేయమని గనులశాఖకు సిఫార్సు చేసారు… ఇది తెలిసిన ఉన్నతాధికారులు ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేసి.., ఆమెను నిన్న సస్పెండ్ చేశారు.

Silica Land Scam: MRO Suspension

Silica Land Scam: నాయకుల పాపం.. అధికారులకు శాపం..!!

నాయకులు .., వారి పెత్తనం తాత్కాలికం.. కానీ అధికారులు శాశ్వతం. ఈ విషయాన్నీ తలలో పెట్టుకుని విధుల్లో ఉంటె ఏ అధికారికి ఇటువంటి చిక్కులు రావు. చినగంజాం మండలం మోటుపల్లిలోని సిలికా భూములపై ఏ నాటి నుండో నాయకుల కళ్ళు ఉన్నాయి. గతంలో ఏ అధికారి అంగీకరించలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఒంగోలుకు చెందిన ఓ నాయకుడు ఈ భూమిని దక్కించుకోవాలి అనుకున్నారు. లీజు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేశారు.. తహసీల్దారు విజయకుమారి ఒత్తిళ్లకు తలొగ్గారు. కోరినట్టు ఎన్ఓసీ ఇచ్చేయాలని నివేదిక ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ భూములను లీజుకి ఇవ్వడం కుదరదు. సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిసిన కొందరు రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు సదరు అధికారులకు, దరకాస్తుదారులకు నోటీసులు ఇచ్చింది. ఈ లోగా ఈ అంతర్గత అవినీతి వ్యవహారం ఉన్నతాధికారులకు వెళ్లడంతో శాఖాపరమైన విచారణ చేశారు. చట్టరీత్యా సొన పోరంబోకు భూముల్లో లీజుకి అనుమతులు ఇవ్వకూడదు. కానీ విధుల్లో నిర్లక్ష్యం వహించి.., ఎన్వోసీ ఇవ్వడానికి సిఫార్సు చేసిన తహసీల్దారుపై చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ అవినీతి వ్యవహారాన్ని “ఆన్లైన్ ప్రకాశం” గత నెలలోనే బయటపెట్టింది. ఈ స్కామ్ పై కథనాన్ని ప్రచురించింది.

Exit mobile version