Friday, May 3, 2024
Home వార్తలు ఏపి సీఎస్ రేసులో కొత్త పేరు .. సీఎం జగన్ ను కలిసిన సీనియర్ ఐఏఎస్...

ఏపి సీఎస్ రేసులో కొత్త పేరు .. సీఎం జగన్ ను కలిసిన సీనియర్ ఐఏఎస్ గిరిధర్

- Advertisement -

ఏపి నూతన సీఎస్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న వేళ కేంద్ర సర్వీసులో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ ఆర్మోణే సీఎం వైఎస్ జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈ నెల 30వ తేదీ రిటైర్ అవుతున్నారు. దీంతో నూతన సీఎస్ గా ఎవరు నియమితులు అవుతారు అన్నది చర్చనీయాంశం అయ్యింది. తొలుత 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి సీఎస్ గా నియమితులు అవుతారు అన్న ప్రచారం జరిగింది. తాజాగా జవహర్ రెడ్డికే సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నారని, ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయని వార్తలు వచ్చాయి.

అయితే కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ గిరిధర్ ఆర్మాణే .. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ఆయనకు సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఆయనను రక్షణ శాఖ నుండి రిలీవ్ చేయాలని కూడా ఏపి సర్కార్ కేంద్రానికి లేఖ రాసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో గిరిధర్ సీఎస్ రేసులో ఉన్నట్లుగా చెబుతున్నారు. గిరిధర్ 1988 బ్యాచ్ కి చెందిన అధికారి. సమీర్ శర్మ తర్వాత నీరభ్ కుమార్ ప్రసాద్, గిరిధర్, పూనం మాలకొండయ్య, కరికాల వలవన్ లు సీనియారిటీ జాబితాలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు రేసులో ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు అనేది హాట్ టాపిక్ అయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....