Wednesday, March 22, 2023
Home వార్తలు ఆ జిల్లాలో ఇక వైవీ హవా మొదలయినట్లే..? బాలినేనికి తెలియకుండానే పెద్ద డ్యామేజ్..!

ఆ జిల్లాలో ఇక వైవీ హవా మొదలయినట్లే..? బాలినేనికి తెలియకుండానే పెద్ద డ్యామేజ్..!

- Advertisement -

వైవీ సుబ్బారెడ్డి … సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి బాబాయి. దివంగత వైఎస్ఆర్ కు తోడల్లుడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన తెరవెనుక మాత్రమే పని చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నప్పుడు ఒక రకంగా పార్టీని నడిపించింది ఆయనే. 2014కు ముందు ఆయన సజ్జల తదితరులు పార్టీని నడిపారు. 2014లో ఆయన ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2018 లో పార్టీ ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డికి కొత్త పెత్తనం ఏమైనా వచ్చిందా.. ? కొత్తగా ఆ జిల్లా మీద ఆధిపత్యం వచ్చిందా..? ఇప్పటికే ఆయన మూడు జిల్లాలకు సమన్వయకర్త కదా..! ఆయనకు ఏమిటి..! ఆధిపత్యం..! పెత్తనం..! ఆయన ఏమిటి చక్రం తిప్పడం అనే అనుమానాలు రావచ్చు. ఆయన సీఎం జగన్మోహనరెడ్డికి సొంత బాబాయి అయినప్పటికీ ఆయన సొంత జిల్లా (ప్రకాశం)కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటికీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన సొంత జిల్లాలోని సొంత మనుషులకు మూడున్నర సంవత్సరాలుగా అందుబాటులో లేక, వారికి ఏమీ పనులు చేయలేక, తను అనుకున్న పనులు చేయించుకోలేక, తన క్యాడర్ కాపాడుకోలేక, తన పట్టు చేజారి పోతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

జిల్లాలో తన మాటే శాసనంగా..!

- Advertisement -

అయితే ఇప్పుడు ఏమైనా పరిస్థితి మారిందా..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే..వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లు సొంత బావ బావమరుదులు. ఇద్దరిదీ ప్రకాశం జిల్లా. బాలినేని శ్రీనివాసరెడ్డి 2014లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత చాలా కాలం సైలెంట్ అయ్యారు. మళ్లీ 2019 ఎన్నికలకు ముందు యాక్టివ్ అయి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డికి పార్లమెంట్ సీటు ఇవ్వలేదు. ఎంపీగా పోటీ చేయాలని చాలా ప్రయత్నం చేశారు గానీ సీటు లభించలేదు. ఆ క్రమంలో అలిగి విదేశాలకూ వెళ్లారు. ఆ తర్వాత రాజ్యసభ అయినా ఇస్తారేమో అని భావించారు గానీ లభించలేదు. టీటీడీ చైర్మన్ పదవిని జగ్మోహనరెడ్డి అప్పగించారు. ఇది అంతా జనాలకు తెలిసింది. తెలియని ఏమిటంటే..? వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య 2014 నుండి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. 2019లో వైవీకి పార్లమెంట్ సీటు ఇవ్వకపోవడం వల్ల వారి మధ్య విభేేదాలు పెద్దవి అయ్యాయి. దాని వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి అయిన తర్వాత ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పడం మొదలు పెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అన్ని నియోజకవర్గాల్లో తన పెత్తనమే కొనసాగించారు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు తన మాట వినేటట్లుగా జిల్లాను శాశించారు.

Granite YSRCP: Internal Issue with Granite

సొంత జిల్లాకు వెళ్లలేని పరిస్థితిలో వైవీ

- Advertisement -

బాలినేని హవా నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి జిల్లాకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వైవీ సుబ్బారెడ్డికి చెందిన క్యాడర్ ఎవరైనా ఆయనతో పని చేయించుకోవాలంటే తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లాల్సి వచ్చేది తప్ప వైవీ సుబ్బారెడ్డి జిల్లాకు వెళ్లలేని పరిస్థితి. ఆయన తల్లి ఒంగోలులో ఉన్నప్పటికీ ఆరు నెలలకు ఒక సారో సంవత్సరానికి ఒక సారి వెళ్లి వచ్చేవారు. ఈ మూడేళ్లలో రెండు మూడు సార్లు మాత్రమే ఆయన ఒంగోలు వెళ్లారు. ఒక ఎంపిగా చేసిన నాయకుడు తన సొంత జిల్లాకు, సొంత ప్రాంతానికి, సొంత మనుషుల వద్దకు వెళ్లలేకపోయారు. బాలినేని, వైవీ మద్య వర్గ పోరు ఎంతగా ఉంది అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పోస్టింగ్ ల విషయంలో కూడా ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో ఉన్నతాధికారులు ఆ అంశాలను సీఎంఓ వరకూ తీసుకువెళ్లగా అక్కడ చిన్న చిన్న పంచాయతీలు జరిగి చివరకు బాలినేని మాటే నెగ్గేది. అయితే ఈ ఏడాది మే నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి నుండి తప్పించారు. మంత్రి పదవి పోయింది కదా బాలినేని పెత్తనం కూడా పోతుందని అని అనుకున్నారు. కానీ ఆ పెత్తనం అలానే ఉంది. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆయన వర్గం ఆధిపత్యం అలానే ఉంది. అయితే అడుగడుగునా విభేదాలు, వివాదాలు, ఫిర్యాదులు బాలినేనిపై పెరిగాయి.

అన్ని నియోజకవర్గాల్లో అనుకూల, వ్యతిరేక గ్రూపులు

- Advertisement -

ఉదాహరణకు తీసుకుంటే చీరాలలో రెండు గ్రూపులు. కరణం బాలరాం బాలినేని గ్రూపులో ఉండగా, ఆమంచి బాలినేని గ్రూపును విభేదిస్తూ ఉన్నారు. దర్శిలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపు బాలినేనితో, మరో గ్రూపు వైవీకి అనుకూలంగా, అలానే అద్దంకి ఇన్ చార్జిగా బాచిన కృష్ణ చైతన్య ఉన్నప్పటికీ వ్యతిరేక గ్రూపు ఉంది. పర్చూరులో ఇన్ చార్జిగా రావి రామనాథం బాబు ఉన్నప్పటికీ వ్యతిరేక గ్రూపు ఒకటి ఉంది. అలానే కనిగిరిలో ఎమ్మెల్యేగా బుర్రా మధుసూధన్ యాదవ్ ఉన్నప్పటికీ ఆయన కు వ్యతిరేక గ్రూపు తరచు బాలినేని వద్దకు వచ్చే వాళ్లు. అదే విధంగా గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు, కొండెపి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ రెండేసి గ్రూపులు ఉండగా, ఒక గ్రూపు బాలినేని వద్దకు రావడం, మరో గ్రూపు వైవీ వద్దకు వెళ్లడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ జిల్లా సమన్వయకర్త బాధ్యతల నుండి కూడా బాలినేనిని తప్పించి వేరే జిల్లాలను అప్పగించారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాకు బాలినేని శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్ గా ఉండగా, ఆయనకు నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. బాలినేనికి సొంత జిల్లాల నుండి తప్పించడంపై వైవీ పాత్ర ఉందని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. తాను దగ్గర బంధువుని కదా మంత్రి పదవి నుండి తప్పించరు అని తొలుత బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. విషయాన్ని రెండు మూడు నెలల ముందుగా పసిగట్టి ఉంటే పెద్దలను కలిసి ఆ పరిస్థితి రాకుండా చూసుకుని ఉండేవారు. తన పదవి పోదు అన్న కాన్ఫిడెన్స్ లో ఉండి జాగ్రత్త పడకపోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగింది. ఆ నష్టం జరిగిన తర్వాత కూడా అలర్ట్ అవ్వకుండా వివాదాలు, వర్గాలు, విభేదాలు ఎక్కువ అయ్యే సరికి ఇప్పుడు కోఆర్డినేటర్ గా కూడా సొంత జిల్లా మీద వదులు కోవాల్సి వచ్చింది.

మళ్లీ ఒంగోలు ఎంపీగా వైవీ అంటూ..

ఇప్పుడు వైవీ వర్గం తమ నాయకుడు మళ్లీ ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారు అని చెప్పుకుంటున్నారు. ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా జంకా వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జంకా వెంకట రెడ్డి వైవీ సుబ్బారెడ్డి వర్గీయుడు. బాలినేని శ్రీనివాసరెడ్డిని జిల్లా నుండి పక్కకు తప్పించడం, ప్రకాశం జిల్లా అధ్యక్షుడుగా జంకా వెంకటరెడ్డిని తీసుకురావడం, దీనిలో వైవీ పాత్ర ఉందని ప్రచారం జరగడం, వైవీ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని ఆయన వర్గీయులు చెప్పుకోవడం చూస్తుంటే ఆ జిల్లాలో పెత్తనం వైవీ చేతిలోకి వెళ్లింది అని అనుకుంటున్నారు. బాలినేని, వైవీ మధ్య విభేదాలు, వర్గపోరు ఉన్న మాట వాస్తవం. వర్గాల కారణంగా పార్టీ నష్టపోయింది అన్న మాట నిజం. అయితే దీనికి పరిష్కారం అయితే పార్టీలో కనిపించడం లేదు. వైసీపీలో ఉన్న గొడవల కారణంగా ఉమ్మడి ప్రకాశంలో టీడీపీ బలపడిందని ఆ పార్టీ భావిస్తొంది. వీళ్ల మద్య ఉన్న విభేదాల కారణంగా జిల్లాలో టీడీపీకి పెత్తనం వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

Most Popular

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్...