Home Uncategorized పశు బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి : కిలారి పెద్దబ్బాయి

పశు బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి : కిలారి పెద్దబ్బాయి

రాష్ట్రంలో ప్రతి గొర్రెల కాపరికి 50% సబ్సిడీ రుణాలు ఇవ్వాలని గొర్రెల మేకల పెంపకదారుల రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి డిమాండ్ చేశారు.ఏపీ గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి గొర్రెల కాపరుల అవగాహన కార్యక్రమం చీమకుర్తిలోని దాచురి రామిరెడ్డి భవన్ లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి పరిశ్రమ తర్వాత గొర్రెల పెంపకం కీలకమైన వృత్తిగా ఉన్నదని తెలిపారు. ఈ రంగం వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. కానీ … వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు తగినంత నిధులు కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెలు మేకల పెంపకం దారులందరూ కూడా చిన్న ,సన్న కారు పేద రైతుల ఎక్కువమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. నిపుణులు చెబుతున్న నివేదిక ప్రకారం…ఒక వ్యక్తి బలంగా ఉండాలంటే సంవత్సరానికి 11 కేజీలు మాంసం తినాలని చెప్తున్నారు.. ఇప్పుడున్న సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో జీవాలను పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం విస్తృతంగా బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు.

జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు మాట్లాడుతూ
ఏ ప్రభుత్వం వచ్చినా గొర్రెల కాపరుల పట్ల చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. ప్రతి సంవత్సరం జనవరి నుండి మేతా, నీరు సరిపోయినంత అందుబాటులో లేక పెంపకందార్లు నిరంతరం వలసలు పోతున్నారని వాపోయారు.వివిధ రకాల జబ్బులు యాక్సిడెంట్లు ప్రకృతి వైపరీత్యాల వలన చనిపోయిన జీవాలకు పశు భీమ పథకం లేనందువలన గొర్ల కాపర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.వారిని ఆదుకోవడానికి ఎక్స్ప్గ్రేసియో పథకం ఏమిలేదన్నారు. పశు బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించి గొర్రెల కాపరులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గొర్రెలకు షెడ్లు ఏర్పాటు చేయాలని, వలసల నివారణకు ప్రతి గ్రామంలో బోర్లు వేసి నీటి తోట్లు కట్టించాలని కోరారు. కరువు దాణా సబ్సిడీ మీద అందించాలని, బడ్జెట్లో మందులకు నిధులు కేటాయించాలని తెలిపారు. వృత్తి రక్షణ ఉత్తిదారుల సంక్షేమం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండల అధ్యక్ష కార్యదర్శులు తాళ్లూరి శ్రీనివాసరావు, కొండ్రజుల జయరాం, బొడ్డురామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.