Home వార్తలు నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ చిన్నాన్న ను మీ పత్రిక, టీవీ చానెల్ లో చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం తగునా ? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ…నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే..నీకు మాత్రం పట్టడం లేదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వివేకానంద రెడ్డి సతీమణి వైయస్ సౌభాగ్య్యమ్మ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించారో…మీ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి నీ కోల్పోయినప్పుడు నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని గుర్తు చేశారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా లక్ష్యంగా చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని నిలదీశారు.

న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడండి

వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత వారే హత్యకు కారణం కావడం మమ్మల్ని ఎక్కువగా బాదపెట్టిన అంశంగా ఉంది. హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం ఇంకా బాధ అనిపించింది.నిందితులను కాపాడుతూ ఎన్నికల్లో నిలబెట్టడం దుశ్చర్యలు మీకు ఏ మాత్రం మంచిది కాదని హితవు పలికారు. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా…న్యాయం ధర్మం ఆలోచన చేయమని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. సొంత కుటుంబ సభ్యునిగా కాకపోయినా.. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా న్యాయం ,ధర్మం,నిజం వైపు నిలబడమని వేడుకొంటున్నా అని పేర్కొన్నారు.

Exit mobile version