Tuesday, April 30, 2024
Home వార్తలు Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ

Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ

- Advertisement -

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై అనుమానితులు ఆరోపణలు చేయడం, ప్రైవేటు కేసు నమోదు కావడం లాంచి చర్యలు నేపథ్యంలో సీబీఐ  అధికారుల దర్యాప్తు ముందడుగులు పడలేదు. కొద్ది రోజులు విరామం ఇచ్చిన సీబీఐ అధికారులు మరల కడపకు చేరుకుని వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లాను వారం రోజుల క్రితం విచారించారు. ఆ తరువాత ఇనాయతుల్లాను అయిదు రోజులుగా తమ వెంటే సీబీఐ అధికారులు ఉంచుకున్నారు.  రెండు సీబీఐ బృందాలు కడప నుండి పులివెందులకు చేరుకుని పలు ప్రదేశాలను పరిశీలించారు. సీబీఐ అధికారి అంకిత్ యుదవ్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు వివేకా నివాసంతో పాటు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీంచాయి.

- Advertisement -

ఇనాయతుల్లాతో పాటు పాటు రెవెన్యూ సర్వేయర్ ను కూడా సీబీఐ అధికారులు వెంట బెట్టుకుని పులివెందులలోని పలు ప్రదేశాలను పరిశీలించి అక్కడ స్థలాల్లో కొలతలు తీస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజున బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని ముందుగా ఇనాయుతుల్లానే ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ ఫోటోలు, వీడియోలు ఇనాయతుల్లా ఎవరెవరికి పంపాడు అనే విషయాల ఆధారంగా కూడా సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తొంది.

- Advertisement -

వివేకా హత్య కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మూడవ నిందితుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా : ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను...

న్యాయానికి…నేరానికి మధ్యనే ఎన్నికలు : వైయస్ షర్మిల

వివేకానంద రెడ్డి రక్తం కళ్ళ చూసిన ఎంపి.అవినాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేయటం వలనే తాను కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల...

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

Most Popular

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...