Home వార్తలు ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పులివెందులలో ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్‌ షర్మిలను గెలిపించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ …ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కోర్ట్ కు వెళ్లి అన్ జస్ట్ ఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళతానని తెలిపారు.

నిందితులను ఓడించండని కడప పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరుతుంటే వైకాపా లో వణుకు పుట్టింది అని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసిపి నాయకులు తనను ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు తమ గోడు వినిపించే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. . కేవలం ప్రతిపక్ష పార్టీలు మాత్రమే వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడకూడదని కోర్టు తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. న్యాయపోరాటం చేస్తూ ప్రతి ఇంటికి రాలేకపోతున్నాననీ …కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని కోరారు.

Exit mobile version