Friday, May 3, 2024
Home వార్తలు Viveka Case: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ ..

Viveka Case: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ ..

- Advertisement -

Viveka Case: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ ఈ కేసులో కీలక సూత్రధారి దేవిరెడ్డి శివశంకరరెడ్డి అని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే  అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించిన తరువాత పలువురు వ్యక్తులు తెరపైకి వచ్చి ట్విస్ట్ లు ఇస్తున్నారు. తొలుత భరత్ కుమార్ ఆ తరువాత గంగాదర్ రెడ్డిలు సీబీఐపైనే ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను విచారించాలని వారు కోరుతున్నారు. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయాంచారు.  సీబీఐ ఎఎస్పీ రామ్ సింగ్ పై అభియోగాలు చేశారు. వివేకా హత్య కేసులో ఇతరుల పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని న్యాయవాది ద్వారా పులివెందుల కోర్టుకు కృష్ణారెడ్డి తెలిపారు. సీబీఐకి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేర పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారంటూ ఆయన తరపు న్యాయవాది లోకశ్వరరెడ్డి కోర్టుకు తెలిపారు.

- Advertisement -

కృష్ణారెడ్డి దాదాపు 30 సంవత్సరాలుగా వివేకానందరెడ్డి వద్ద పీఏ గా పని చేశారు. ఇప్పుడు ఆయనే వివేకా కుమార్తె, అల్లుడు, సీబీఐ పైన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివేకా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలు సీబీఐ నిర్వహిస్తున్న పీఏ కృష్ణా రెడ్డి చేసిన పిర్యాదుపై ఎస్పీ చర్యలు చేపట్టలేదు. దాంతో ఆయన పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో పలు మార్లు కృష్ణారెడ్డిని సీబీఐ ఇంతకు ముందు విచారించింది.  

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....