Saturday, April 20, 2024
Home మా ఎడిటోరియల్ Subbarao Gupta: అవును.. సుబ్బారావు గుప్తా గెలిచాడోచ్..! మరి ఓడిందెవరు..!?

Subbarao Gupta: అవును.. సుబ్బారావు గుప్తా గెలిచాడోచ్..! మరి ఓడిందెవరు..!?

- Advertisement -

Subbarao Gupta: సూచనలు చేసాడని.., లోపాలు చెప్పాడని.., తప్పులను బయపెట్టాడని..

- Advertisement -

ఇంటికెళ్లి భార్యాపిల్లల్ని బెదిరించారు..

- Advertisement -

బయట లాడ్జిలో తలదాచుకుంటే వెళ్లి కొట్టారు..

- Advertisement -

మోకాళ్లపై నిలబెట్టి చేతులు జోడించి దండం పెట్టించారు..

సాక్షాత్తూ మంత్రి గారే “అతను పిచ్చోడ”ని ముద్ర వేశారు..

సీన్ తిరగేస్తే

ఆ కొట్టిన వాడిపై కేసులు పెట్టించారు..

ఆ బాధితున్ని (మంత్రి గారి భాషలో పిచ్చోడిని) సీఎం జన్మదిన వేడులకు పిలిచారు..

కేకు కట్ చేయించారు.. ముక్కలు పంచుకున్నారు..

చివరికి సాక్షాత్తూ సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇప్పించారు..!”

ఇది సింపుల్ కథ.. కానీ….

  • 156 లక్షల ఓట్లు.. 151 సీట్లు సాధించి.. వేల కోట్ల సంక్షేమ పథకాలను అందిస్తూ.. పాలనలో తిరుగులేదు, ప్రజాబలంలో ఎదురులేదు.. పార్టీకిక భయం లేదు.. అనుకుంటున్న పార్టీ పెద్దలకు మొదటిసారిగా లోపాలు చెప్పాడు.. తప్పులను సరిదిద్దుకోమన్నాడు.. హెచ్చరించాడు.. కార్యకర్తల కష్టం వివరించాడు.. కొన్ని నెలలుగా తన పార్టీలోని వేలాది కార్యకర్తలు మనసులో దాచుకున్న అంతరావేదనని.., కడుపులో కాల్చుకుంటున్న మంటని అందరి కంటే ముందుగా.. అందరికీ స్ఫూర్తిగా.. ఒక్క ముందడుగు వేసాడు.. “అవును.. సుబ్బారావు గుప్తా గెలిచాడు“..!
  • ఒక వ్యక్తి.. ఒక పార్టీ కార్యకర్త.. ఒక పార్టీకి శ్రేయోభిలాషి.. ఒక అభిమాని.. పార్టీల్లో వీళ్ళందరూ ఉంటారు. కేవలం పార్టీకి కార్యకర్తలా నాయకున్ని చూస్తూ జెండాలు మోస్తూ, కేరింతలతో ఆగలేదు. అభిమానిలా భజనలకు పరిమితమవ్వలేదు.. అభిమానులు భజనలు చేస్తారు, పనులు పొందుతారు.. కానీ శ్రేయోభిలాషులు హెచ్చరిస్తారు, విమర్శిస్తారు, తప్పులు చెప్తారు, సరిదిద్దుకోమంటారు.. సుబ్బారావు గుప్తా చేసిందదే.. శ్రేయోభిలాషిగా మారాడు. రాష్ట్రంలోని చాలా మంది మనసులకు దగ్గరయ్యాడు. పార్టీలో హీరోగా మారాడు.. అతని కంటే, అతని మాటలకు పార్టీలో అనేకమంది విలువనిచ్చేలా విషయం చెప్పగలిగాడు.. సొంత పార్టీని విమర్శిస్తే.., సొంత పార్టీ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాల్లో సానుకూలత రావడం అంత సులువు కాదు.. కానీ గుప్తా వైసీపీ సోషల్ మీడియా మొత్తం అండ పొందాడు.. “అవును.. సుబ్బారావు గుప్తా గెలిచాడు..”!
  • ముప్పుని గ్రహించాడు.. కొందరి బెదిరింపులను భరించాడు.. దాడిని ఊహించాడు.. గుంటూరు వెళ్లి లాడ్జిలో తలదాచుకున్నాడు.. భార్య పిల్లలు బాధ పడుతుంటే లోలోపల వేదన పడ్డాడు.. తన ఇంటిలో సొంత పార్టీ మనుషులే అరాచకం చేస్తుంటే లోలోపల భరించాడు.. భయపడుతూనే, భరించాడు.. కానీ.. “తాను చెప్పినది కరెక్ట్.., పెద్దలు తప్పుగా అర్ధం చేసుకున్నారు.. అంటూ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేసాడు.. తన మొదటి మాటలకు బెదిరింపులు, దాడులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. భార్యాపిల్లలు దూరంగా తలదాచుకుని.. భయంతోనే పార్టీకి సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు.. గుంటూరులో తాను ఉన్న లాడ్జిలో తనపై దాడి జరిగితే అచేతనావస్థలో చేతులు జోడించాడు.. కానీ ఆ క్షణాన సొంత పార్టీ, పరాయి పార్టీలో కూడా “రాజకీయం అంటే ఇంతేనా” అంటూ గుప్తా ఒక పాఠం అనేలా గుణపాఠంగా మారాడు.. “అవును.. సుబ్బారావు గుప్తా గెలిచాడు..”!
  • “తను నమ్మిన నాయకుడు.. తను తిరిగి ప్రచారం చేసిన నాయకుడు.. తను పని చేసిన నాయకుడు.. తన గురించి మొత్తం తెలిసిన నాయకుడు తనను పిచ్చోడని ముద్ర వేసాడు.. అది జరిగి 24 గంటలు గడవక ముందే అదే నాయకుడు గుప్తాని పిలిపించి సీఎం జన్మదిన వేడుకలు జరిపించి.. కేకు కట్ చేయించి.. నోరారా తినిపించి.. శుభాకాంక్షలు చెప్పించి, మీడియాతో మాట్లాడించాడు.. “అవును.. సుబ్బారావు గుప్తా గెలిచాడు..!”
  • “చివరికి.. లక్షలాది మంది ఆరాధించే నాయకుడు.. వేలాది సైన్యం కలిగిన పాలకుడు.. పార్టీ ముద్దుగా జననేతగా పిలుచుకునే సీఎం జగన్ అపాయింట్మెంట్ పొందాడు.. తను పని చేసిన.., తనను పిచ్చోడని ప్రకటించిన.. నాయకుడి ద్వారానే ఆ అపాయింట్మెంట్ పొందాడు.. ఆ క్షణం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుంటారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు, మంత్రులు, ఉద్యోగులు, ఎంతోమంది ప్రముఖులు సైతం సీఎం అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి అడుగుతూ, అర్జీలు పెడుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికీ కరుణించని సీఎం జగన్ గుప్తాని కలిసేందుకు, అపాయింట్మెంట్ ఇచ్చారు.. సరే.. అతను ఇచ్చినా, ఇవ్వకపోయినా అంత వరకు వెళ్లడమే గొప్ప.. అందుకే “సుబ్బారావు గుప్తా గెలిచాడు..”!

సుబ్బారావు గుప్తా నువ్వు గెలిచావోయ్.. దెబ్బలు తిన్నా, బెదిరింపులు ఎదుర్కొన్నా, పిచ్చోడని ముద్ర వేయించుకున్నా, నీ కుటుంబం వారం రోజుల పాటూ ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నా.. నిద్రలేని రాత్రులు గడిపినా.. చివరికి నువ్వు గెలిచావోయ్.. వేలాది మంది ఆవేదనని అర్ధవంతంగా చెప్పావ్.. ఎవ్వరూ వేయలేని అడుగు వేసావ్.. చివరికి లక్షలాది మందికి అందని వరం అందుకున్నావ్.. .. కానీ ఎవరు ఓడినట్టు..!? నువ్వు తప్పు పట్టిన వారా..!? నిన్ను కొట్టిన వారా..? నిన్ను పిచ్చోడిని చేసిన వారా..!? నిన్ను కలవాలని పిలిపించిన వారా..!? ఏ ఎపిసోడ్ మొత్తం మీద గెలుపు నీదైతే, ఓడినదెవరు..!? అర్ధం చేసుకున్న వారికీ చేసుకున్నంత…! ఇక్కడ ఓడినవారి గురించి మనం రాయడం అనవసరం, విజేత మాత్రం సుబ్బారావు గుప్తా…!!

- Advertisement -
RELATED ARTICLES

బోండా ఉమా పోటీని అడ్డుకునే ప్రయత్నం : కనకమేడల రవీంద్ర

ఎన్డీయే కూటమి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని టిడిపి మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర ఆరోపించారు....

జగన్….మీ ఛాతీలో ఉన్నది గుండెనా ? బండనా? : వైయస్ షర్మిల

గత రెండు ఎన్నికల్లో వైకాపా విజయం కోసం పని చేసాను. మీ కోసం బై బై బాబు నినాదం తీసుకువచ్చి తెలుగుదేశం మిద పోరాడాను. 3000 కిలో మీటర్ల పాదయాత్ర...

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

Most Popular

బోండా ఉమా పోటీని అడ్డుకునే ప్రయత్నం : కనకమేడల రవీంద్ర

ఎన్డీయే కూటమి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని టిడిపి మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర ఆరోపించారు....

జగన్….మీ ఛాతీలో ఉన్నది గుండెనా ? బండనా? : వైయస్ షర్మిల

గత రెండు ఎన్నికల్లో వైకాపా విజయం కోసం పని చేసాను. మీ కోసం బై బై బాబు నినాదం తీసుకువచ్చి తెలుగుదేశం మిద పోరాడాను. 3000 కిలో మీటర్ల పాదయాత్ర...

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...