Home వార్తలు Gottipati Ravikumar: సుప్రీమ్ కోర్టులో భారీ ఊరట..!

Gottipati Ravikumar: సుప్రీమ్ కోర్టులో భారీ ఊరట..!

Gottipati Ravikumar: అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు, సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గొట్టిపాటి రవికుమార్ కూడా చెందిన కిషోర్ గ్రానైట్ కంపెనీకి ఏపి ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీస్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. కిషోర్ గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయి విజిలెన్స్ డిపార్టుమెంటు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై ఏపి ప్రభుత్వం ఆ కంపెనీని మూసివేయాలనీ, అలాగే రూ.50 కోట్లు జరిమానా చెల్లించాలంటూ గొట్టిపాటి రవికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే ఆ షోకాజ్ నోటీస్ ను గొట్టిపాటి రవి కోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు సింగల్ జడ్జి బెంచ్ కొట్టేసింది. ఆ తరువాత ఆయన ఏపి ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ని ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ నందు కూడా రవికుమార్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏపి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ చెల్లుతుందని, ప్రభుత్వం చెప్పినట్టు 50 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును గొట్టిపాటి రవి కుమార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసారు. రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ తరుపు న్యాయవాది, విజిలెన్స్ కమిషన్ కు, ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ కు సంబంధం లేదని కోర్టులో వాదనలు వినిపించారు. అసలు ఈ విషయంలో అవకతవకలు ఉన్నాయి అంటూ, దీనిపై నివేదిక ఇవ్వటానికి, సిఫార్సు చేయటానికి వారికి అధికారం లేదని గొట్టిపాటి రవికుమార్ తరుపు న్యాయవాది శ్యాం దివాన్ కోర్టుకు వివరించారు. శ్యాం దివాన్ వాదనలను సమర్ధించిన సుప్రీం కోర్టు  ధర్మాసనం.. గొట్టిపాటి రవి కుమార్ కు ఉపసమనం కల్పించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని తోసి పుచ్చిన సుప్రీం కోర్టు..ఏపి ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీస్ ని సస్పెండ్ చేస్తూ స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరో సారి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.

Exit mobile version