Home వార్తలు Breaking: జగన్ టార్గెట్ గా కేసీఆర్ కి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు..!!

Breaking: జగన్ టార్గెట్ గా కేసీఆర్ కి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు..!!

Breaking: వెలుగొండ ప్రాజెక్టు సమస్యపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఇంతకు ముందు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి మూడు లేఖలు రాసినా ఎటువంటి స్పందన రాకపోవడంతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసిఆర్ కు జగన్ ను టార్గెట్ గా చేస్తూ ఘాటు లేఖ రాశారు. వెలుగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదుని పునః పరిశీలించి, ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు ను అడ్డుకోవద్దని వారు కోరారు.

ఏళ్ల తరబడి కరువు ఫలితంగా ప్రకాశం జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాల సాగు భూమి పూర్తిగా బీడువారిందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దయనీయ స్థితిని, కరువుని తీర్చే ఏకైక పరిష్కారంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కేసిఆర్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతగాని తనం,  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తుకు ముప్పు వాటిల్లిందన్నారు. పదే పదే ఫిర్యాదులతో తెలంగాణ ప్రభుత్వ అంతరంగం ఏమిటో? కరువు జిల్లా ప్రకాశంపై కక్ష ఎందుకో ? అర్ధం కావడం లేదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో ప్రకాశం జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళన చెందతోందన్నారు. 2014  పునర్విభజన చట్టంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆరు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని వాటిలో వెలుగొండ ఉన్న సంగతి తమరికి తెలుసునన్నారు. వెలుగొండకు అనుమతులు లేవు, అక్రమ ప్రాజెక్టు అంటే తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి అక్రమ ప్రాజెక్టులు కావా అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు ఎటువంటి హక్కులున్నాయో, వెలుగొండకి కూడా అదే హక్కులు, అనుమతులు ఉన్నాయని వారు అన్నారు. ఏపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికే కేంద్ర గెజిట్ లో స్థానం కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version