Sunday, April 28, 2024
Home మా ఎడిటోరియల్ Balineni: బాలినేని భారీ ప్లాన్ ..! 18, 22 తేదీల్లో కొన్ని సెన్సేషన్స్ తప్పవా..!?

Balineni: బాలినేని భారీ ప్లాన్ ..! 18, 22 తేదీల్లో కొన్ని సెన్సేషన్స్ తప్పవా..!?

- Advertisement -


Balineni: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు కూడా. ఓ రకంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు..! అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని కొన్ని అనివార్య పరిస్థితులు, కొన్ని అంతర్గత కారణాలతో మంత్రి పదవి నుండి తొలగించాల్సి వచ్చింది. ఈ పరిణామంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి చెందిన మాట వాస్తవం. ఆసమ్మతి రాజేసిన మాట వాస్తవమే. అసంతృప్తి వాదులతో చర్చలు జరిపిన మాట వాస్తవం. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నాలుగైదు రోజులుగా సైలెంట్ గా ఉండిపోయారు. సీఎం జగన్మోహనరెడ్డి తో చర్చించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో తనకు ఎటువంటి అసంతృప్తి లేదని చెప్పారు. ఆ తరువాత మళ్లీ ఆయన బయటకు రాలేదు. ఎక్కడ ఉన్నారో..? ఎమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అయితే తన పార్టీ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు. స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అసలు ఆయన వ్యూహం ఏమిటి..? ఆయనను మంత్రి పదవి నుండి ఎందుకు తొలగించారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Balineni: బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యాచరణ ఏమిటంటే..?

సీఎం జగన్ ను కలిసి వచ్చిన తరువాత హైదరాబాద్ వెళ్లిపోయారు. రేపు (సోమవారం) విజయవాడ వస్తున్నారు. సాయంత్రానికి ఒంగోలు వస్తారు. సోమవారం సాయంత్రం బాలినేనికి ప్రకాశం జిల్లాలో స్వాగతం పలికేందుకు కార్యాచరణ రెడీ అయ్యింది. దాదాపు వెయ్యి కార్లతో ఆయన కు ర్యాలీగా స్వాగతం పలకాలని ఆయన అనుచరులు, కార్యకర్తలు, ఆయన సన్నిహితులు ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి అయిదారు నియోజకవర్గాల్లోని నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా దాటిన తరువాత ప్రకాశం జిల్లా సరిహద్దు (మార్టూరు దాటిన తరువాత) నుండి ర్యాలీగా బాలినేనికి స్వాగతం పలకనున్నారు. దీనికి జగన్మోహనరెడ్డికి సంఘీభావంగా నిలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం అంటూ పేరు పెట్టారు. దీనిలో అర్ధం ఏమి ఉంటుంది. జగన్మోహనరెడ్డి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి. బాలినేని ఆ పార్టీకి నాయకుడు. జగన్ కు సంఘీభావంగా నిలిచిన బాలినేనికి స్వాగతం ఏమిటన్న విమర్శ వస్తుంది. ఇక ఈ నెల 22వ తేదీన ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఉంది. సున్నా వడ్డీ పథకాన్ని ఒంగోలు నుండి ఆ రోజు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దీనికి ముందస్తు ఏర్పాట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి చేయనున్నారు. అయితే ఒంగోలులో 22 తేదీన జరిగే కార్యక్రమంలోనే సీఎం జగన్ బాలినేనికి ఒక పదవి ప్రకటించనున్నారని వార్తలు వినబడుతున్నాయి. పార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవిని జగన్ అనౌన్స్ చేయబోతున్నారుట. రాష్ట్ర స్థాయిలో కేబినెట్ ర్యాంక్ ఉండే పదవితో పాటు పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్ లాంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

సామాజికవర్గ కోణంతో పాటు

- Advertisement -

ఇక బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి వర్గం నుండి తొలగించడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు. మృతి చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డిని పక్కన బెడితే బాలినేని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఉన్నారు. వీళ్ల ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాళ్లను కొనసాగిస్తూ ఇతర సామాజికవర్గాల వారిని తప్పిస్తే కశ్చితంగా పార్టీలో విభేదాలు వస్తాయి. జగన్మోహనరెడ్డిని చాలా ధాటిగా విమర్శిస్తారు. రెడ్డి సామాజికవర్గం వాళ్లను దగ్గర పెట్టుకుని మిగిలిన వాళ్లను తీసేసారు అనే విమర్శ వస్తుంది. బుగ్గన, పెద్దిరెడ్డి లను తొలగించడానికి అవ్వదు. శాఖల పరంగా, రాజకీయపరంగా ఈ ఇద్దరిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాంతో బాలినేనిని తొలగించడం తప్పనిసరి అయ్యింది. మరొక కారణంగా బాలినేనితో జిల్లాలోని పలువురు సీనియర్ నేతలతో విభేదాలు ఉన్నాయి. జగన్మోహనరెడ్డికి సమీప బంధువైన వైవీ సుబ్బారెడ్డితోనూ బాలినేనికి విబేధాలు ఉన్నాయి. ఈ విబేదాలకు తోడు జిల్లా పార్టీలో గ్రూపుల మూలంగా పార్టీ బలహీనమవుతోందని కూడా జగన్మోహనరెడ్డికి అందిన సమాచారం. వీటిన్నింటికి తోడు ఈ మూడు సంవత్సరాలుగా బాలినేని ప్రవర్తన, ఆయన అనుచరులపైనా పలు ఆరోపణలు వచ్చాయి. ఇలా అనేక రకాల కారణాల వల్ల బాలినేనిని పక్కన బెట్టాల్సి వచ్చింది. తొలుత అసంతృప్తి, అసమ్మతి వ్యక్తం చేసినా ఆ తరువాత మెత్తబడిన బాిలనేని ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం పని చేస్తూ జిల్లాలో తన బలం ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకునేలా ఈ రెండేళ్లు పని చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...