Friday, May 3, 2024
Home వార్తలు ఉద్యోగుల ఆందోళనకు తెరదించిన ఎన్నికల కమిషనర్…పోస్టల్ బ్యాలెట్ పై కీలక ఉత్తర్వులు

ఉద్యోగుల ఆందోళనకు తెరదించిన ఎన్నికల కమిషనర్…పోస్టల్ బ్యాలెట్ పై కీలక ఉత్తర్వులు

- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్‌ బ్యాలెట్‌ ను సమర్పించేందుకు ఈ నెల 22 వరకే చివరి తేదీ అనే ప్రచారంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గడువు తేదిన ఈ నెల 26 వరకు పొడిగించినట్లు సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 8లోపు ఓటు హక్కు వినియోగించుకోని వారు తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉండదని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఫారం-12ను పూర్తి చేసి, అక్కడే సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఫస్ట్‌ సెంట్రల్‌ ఎక్స్ఛేంజ్‌ను ఈ నెల 28న సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎక్స్ఛేంజ్‌-2 ఓటు వేయని పోస్టల్‌ బ్యాలెట్లు మే 3న, మే 8న ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఉపయోగించని బ్యాలెట్లు, మిగిలిపోయిన వాటిని మే 10న వెలగపూడిలోని కలెక్టర్ల సమావేశం హాలులో నోడల్‌ అధికారులకు అప్పజెప్పి రసీదులు తీసుకోవాల్సి ఉంటుందని సిఇఒ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...