Home వార్తలు పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వదిలేయాలా ? : వర్ల రామయ్య

పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వదిలేయాలా ? : వర్ల రామయ్య

రానున్న ఎన్నికల్లో అక్రమంగా, అడ్డ దారిన గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. బుధవారం మంగళగిరి లోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఐదేళ్ల పరిపాలనలో ఇసుక,లిక్కర్,ఖనిజ సంపద ద్వారా అక్రమంగా సంపాదించన కోట్లాది రూపాయలను ఎన్నికల్లో ఖర్చు పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే…తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట విమానాశ్రయం సమీపాన మూడు గౌడన్లను వైసిపి అద్దెకు తీసుకుంది. రాష్ట్ర ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయగపడే మెటీరియల్స్ ను ఆ గౌడన్లల్లో దాచి పెట్టారని వెల్లడించారు. విషయం తెలుసుకున్న తమ పార్టీ నాయకులు అక్కడకి వెళ్లి ఒక గౌడన్ ను పరిశీలించగా రిస్ట్ వాచీ లు, కుక్కర్ , చీరలు అక్కడ ప్రత్యక్షమయ్యాయని పేర్కొన్నారు.

ఈ విషయంపై వైసిపి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ నాయకులకు ఫోన్లో “ఘటన వెనుక పెద్ద పెద్ద వారున్నారు ..మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని బెదిరించారు. వైసిపి లో చెవిరెడ్డి కంటే పెద్దవారు అంటే జగన్మోహన్ రెడ్డి కాదా? పెద్ద పెద్ద వారు ఐతే ఈ విషయం వదిలేయాలా అని ప్రశ్నించారు. సంఘటన పై సి_విజిల్ యాప్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి,భారత చీఫ్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత ఎన్నికల కమీషన్ కు లేదా? జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంఘటన ప్రదేశానికి వెళ్ళారా ? సంఘటన పై సెంట్రల్ కమిషన్ ఎందుకు జోక్యం చేసుకుకోడం లేదు ? ఎలక్షన్ కమీషన్ చేతిలో రాష్ట్రం నడుస్తుందా?ఇంకా వైసిపి చేతిలో రాష్ట్రం నడుస్తుందా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని.మూడు గౌడన్లను వెంటనే స్వాధినపరుచుకొవాలని డిమాండ్ చేశారు. ఘటన వెనుక ఉన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి సొమ్మును ఉపయోగించి ఎన్నికల వ్యవస్థను అపాహస్యం చేయవద్దని జగన్మోహన్ రెడ్డికి సూచించారు.