Saturday, May 11, 2024
Home వార్తలు ఏపి ప్రభుత్వ సలహదారుగా ఆలీ బాధ్యతలు స్వీకారం

ఏపి ప్రభుత్వ సలహదారుగా ఆలీ బాధ్యతలు స్వీకారం

- Advertisement -

ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైన ప్రముఖ హస్య నటుడు ఆలీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు వెంట రాగా ఆలీ తన ఛాంబర్ లోకి ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలీ మీడియాతో మాట్లాడారు. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తాను ఏమి చేయాలన్న దానిపై ఒక వారంలో ఖరారు అవుతుందని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దృష్టి పెడతానని ఆలీ పేర్కొన్నారు. ఇటీవల తాను ఉత్తరాంధ్ర లో షూటింగ్ కు వెళ్లిన సందర్భంలో అక్కడ బీచ్ లు, రోడ్లు చూసిన తర్వాత వాటిని కొద్దిగా అభివృద్ధి చేస్తే తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషా మువీలు కూడా ఇక్కడ షూటింగ్ లు జరుపుకుంటాయని ఆలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని వల్ల ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సీఎం వైఎస్ జగన్ మనసున్న మనిషి అని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే ఘన విజయమని ఆలీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...