Saturday, April 27, 2024
Home వార్తలు కేరళలో బస్సు ప్రమాదం .. 15 మంది ఏలూరు జిల్లా వాసులకు గాయాలు

కేరళలో బస్సు ప్రమాదం .. 15 మంది ఏలూరు జిల్లా వాసులకు గాయాలు

- Advertisement -

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శబరిమల నుండి తిరిగి వస్తున్న ఏపి అయ్యప్ప స్వామి భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. పతనంతిట్ట జిల్లా లాహల్యాంప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని పత్తనంతిట్ట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది యాత్రికులు ఉన్నారు.

ఏపిలోని ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన 40 మంది దీక్షా స్వాములు ఈ నెల 15వతేదీన శబరిమల వెళ్లారు. వీరు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని సమాాచారం. ప్రమాద సమాచారం తెలియడంతో దీక్షా స్వాముల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

Most Popular

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...