Saturday, April 27, 2024
Home వార్తలు Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా .. బాబు కోటరీపై కీలక వ్యాఖ్యలు

Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా .. బాబు కోటరీపై కీలక వ్యాఖ్యలు

- Advertisement -

Divyavani: తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపిన దివ్యవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖలో మాత్రం తన వ్యక్తిగత కారణాలు అని పేర్కొన్నప్పటికీ మీడియా సమావేశంలో పార్టీ కార్యాలయంలో రాజకీయాలను ప్రస్తావించారు.  ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి తర్వాత దాన్ని ఆమె డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దివ్యవాణి బుధవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తరువాత కొద్దిసేపటికే తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంత కాలంగా పార్టీ అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతూ వస్తున్నారని, పార్టీలో అవమానాలకు తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశం పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఓ దశలో దివ్యవాణి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన లాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి అలా ఉంటున్నారని దివ్యవాణి అన్నారు. గౌరవం లేని చోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు బుధవారం పార్టీ ఆఫీసుకు వెళితే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని దివ్యవాణి అవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే..అందరికంటే ముందు తానే కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. సినీ రంగంలో బాలకృష్ణ కంటే తానే పెద్ద నటినని పేర్కొన్నారు.  టీడీపీలోకి సినీ రంగం నుండి వచ్చిన అనేక మంది ఇమడలేక బయటకు వెళ్లిపోయారంటూ జయప్రద, జయసుధ,  ఆలీ, రోజా పేర్లను ప్రస్తావిస్తూ ఇప్పుడు తన వంతు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు దివ్యవాణి.

- Advertisement -
RELATED ARTICLES

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

Most Popular

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...