Friday, March 29, 2024
Home వార్తలు Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ

Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ

- Advertisement -

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై అనుమానితులు ఆరోపణలు చేయడం, ప్రైవేటు కేసు నమోదు కావడం లాంచి చర్యలు నేపథ్యంలో సీబీఐ  అధికారుల దర్యాప్తు ముందడుగులు పడలేదు. కొద్ది రోజులు విరామం ఇచ్చిన సీబీఐ అధికారులు మరల కడపకు చేరుకుని వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లాను వారం రోజుల క్రితం విచారించారు. ఆ తరువాత ఇనాయతుల్లాను అయిదు రోజులుగా తమ వెంటే సీబీఐ అధికారులు ఉంచుకున్నారు.  రెండు సీబీఐ బృందాలు కడప నుండి పులివెందులకు చేరుకుని పలు ప్రదేశాలను పరిశీలించారు. సీబీఐ అధికారి అంకిత్ యుదవ్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు వివేకా నివాసంతో పాటు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీంచాయి.

- Advertisement -

ఇనాయతుల్లాతో పాటు పాటు రెవెన్యూ సర్వేయర్ ను కూడా సీబీఐ అధికారులు వెంట బెట్టుకుని పులివెందులలోని పలు ప్రదేశాలను పరిశీలించి అక్కడ స్థలాల్లో కొలతలు తీస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజున బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని ముందుగా ఇనాయుతుల్లానే ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ ఫోటోలు, వీడియోలు ఇనాయతుల్లా ఎవరెవరికి పంపాడు అనే విషయాల ఆధారంగా కూడా సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తొంది.

- Advertisement -

వివేకా హత్య కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మూడవ నిందితుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...